
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంటోంది. ఆ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి రీపోలింగ్ నిర్వహించనుండగా.. మిగిలిన 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. 100 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉండగా.. అధికార టీఎంసీ 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా భవానిపూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై సువెందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అటు నందిగ్రామ్‌లోనూ సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. డీఎంకే కూటమి 58 స్థానాల్లో ముందంజలో ఉంది. 36 స్థానాల్లో ఆధిక్యంతో విజయ్ సారథ్యంలోని టీవీకే రెండో స్థానంలో నిలుస్తోంది. అన్నా డీఎంకే కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కేరళలోని మొత్తం 140 స్థానాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు యూడీఎఫ్ కూటమి 75 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ కూటమి 60 స్థానాలు, బీజేపీ కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
అస్సాంలో మొత్తం 126 స్థానాల్లో అధికార బీజేపీ కూటమి 69 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. కాంగ్రెస్ కూటమి 15 స్థానాలు, ఏఐయూడీఎఫ్ 1 స్థానం, ఇతరులు 1 స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.
పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 22 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 6 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.