ఇక వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు కొన్ని రకాల చెట్లు ఉండటం అస్సలే మంచిది కాదు అంటారు పండితులు. అవి ఆ ఇంటి కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అయితే వాస్తు నిపుణుల ప్రకారం ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం మంచిదేనో కాదో వివరంగా తెలుసుకుందాం.
చాలా మంది తమ ఇంటి ఆవరణంలో మామిడి చెట్టు పెంచుకుంటారు. కొంత మంది ఇంటి ముందే మామిడి చెట్టు నాటుకుంటే, మరికొంత మంది పెరట్లో మామిడి చెట్టును పెంచుకుంటారు. అయితే చాలా మంది ఇంటి ముందు మొక్కలు ఉండటం వలన స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంతే కాకుండా ఇంటి ముందు పండ్లు ఉన్న చెట్లు ఉండటం చాలా మంచిది అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మందు కొన్ని చెట్లు ఉండటం అస్సలే మంచిది కాదంట. మరి మామిడి చెట్టు ఇంటి ముందు ఉండొచ్చా? ఇది శుభమా? అశుభమా అంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదంట. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అందువలన ఇంటికి చాలా దూరంలో మామిడి చెట్టు నాటుకోవడం మంచిదంట. వాస్తు ప్రకారం ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం, చెట్టు నీడ ఇంటి మీద పడటం అశుభకరం. ఎప్పుడూ కూడా ఇంటి మీద మామిడి చెట్టు నీడ పడకుండా ఉన్న ప్రదేశంలో మాత్రమే మామిడి చెట్టును నాటుకోవాలంట.
మామిడి చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా కుటుంబంలో కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం వలన ప్రతి కూల శక్తుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇంటి మందు మామిడి చెట్టు నాటకూడదు అని చెబుతున్నారు పండితులు.
అయితే చాల వరకు మామిడి చెట్టు చాలా శుభ ప్రదమైనది. దీని ఆకులు ఇంటి ముందు తోరణంలా కడతారు, అలాగే పండ్లను కూడా దేవుడికి సమర్పిస్తారు, కాబట్టి చాలా మంది ఇది ఇంటి ముందు ఉండటం చాలా మంచిది అనుకుంటారు. కానీ ఇది ఇంటి ముందు ఉండటం మంచిది కాదు, ఒక వేళ మామిడి చెట్టును ఇంటిలో నాటుకుంటే, నైరుతి దిశలో నాటడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, నిపుణుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి.




