Reading Time: < 1 minute

టెన్త్ ఫలితాల్లో నారాయణ జయకేతనం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాయి. నారాయణ విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారని విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ, కోర్ కమిటీ సభ్యురాలు  రమా నారాయణ తెలిపారు. మేథాశ్ శ్రీరామ 597 మార్కులతో స్టేట్ టాపర్‌‌‌‌గా నిలిచారని చెప్పారు. శోభిత కొప్పారపు, మన్నే చంద్రహాస్, తూముల నిశ్చయ్ ప్రణవ్, కిలారి లలిత్ 596 మార్కుల సాధించారని పేర్కొన్నారు.

590 కంటే ఎక్కువ మార్కులను 116 మంది విద్యార్థులు, 595 మార్కులను ఆరుగురు, 594 మార్కులను 8 మంది, 593 మార్కులను 8 మంది స్టూడెంట్లు సాధించారని వివరించారు. తెలంగాణలో 530.26 సగటు మార్కు సాధించిన ఏకైక విద్యాసంస్థ నారాయణ మాత్రమేనని వివరించారు. 8,935 మంది విద్యార్థులతో 99.66% ఉత్తీర్ణత సాధించడం తమ పటిష్టమైన విద్యాప్రణాళికకు నిదర్శనమన్నారు. ఈ అద్భుత విజయానికి కారకులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను,  బోధనా సిబ్బందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. పునీత్ అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.