
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదనే సాకుతో విద్యార్థుల హాల్ టికెట్లు ఆపి, పరీక్షలకు హాజరుకాకుండా అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) ప్రకటించింది. ఇలా చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ హెచ్చరించారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం పూర్తిగా తప్పని తెలిపారు. మరోపక్క కొన్ని అనుమతులు లేని కాలేజీలు ఎలాంటి గుర్తింపు లేకుండానే కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు.