
Improve Sperm Quality: నేటి వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గడం, నాణ్యత లోపించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను సహజంగానే అధిగమించే అవకాశం ఉంది.
ఇందులో మొదటిగా గుడ్లు ఎంతో ముఖ్యమైనవి. ఇవి ప్రోటీన్, విటమిన్-E లాంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉండి వీర్యకణాలను రక్షించడంలో, వాటి కదిలికలను పెంచడంలో సహాయపడతాయి. అలాగే పాలకూర, ఇతర ఆకుకూరలు ఫోలిక్ యాసిడ్‌ను అందించి ఆరోగ్యకరమైన వీర్యకణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అరటిపండ్లు కూడా పురుషుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, బ్రోమెలైన్ అనే ఎంజైమ్ హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేసి, వీర్యకణాల కదలికను మెరుగుపరుస్తాయి. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఎల్-అర్జినిన్ అనే అమైనో యాసిడ్ వీర్య పరిమాణం, కణాల సంఖ్య పెరగడంలో సహకరిస్తుంది. అయితే దీన్ని మితంగా తీసుకోవడం మంచిది.
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వృషణాలకు రక్తప్రసరణను మెరుగుపరచి, వీర్యకణాల నాణ్యతను పెంచుతాయి. అలాగే దానిమ్మలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి, టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా వెల్లుల్లి కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే అల్లిసిన్ రక్తప్రసరణను పెంచి, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉండి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి, వీర్యకణాల పెరుగుదలకు కీలకంగా పనిచేస్తుంది.
ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోవడంతో పాటు తగినంత నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తగ్గించే జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు.