Reading Time: < 1 minute
Janasena Telangana Joining Committee Convener Prem Kumar Appointed

Janasena Party: తెలంగాణలో జనసేన బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది.. జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.. గతంలో ఉన్న జాయినింగ్ కమిటీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం 10 మంది సభ్యులతో సవరించిన కమిటీని ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన జాయినింగ్ కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేయడంలో ఆయన గత కొంతకాలంగా జాయినింగ్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పార్టీ తెలిపింది.

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గత ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేస్తూ పార్టీ విస్తరణకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, జనసేనలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారిని సమన్వయం చేయడం వంటి బాధ్యతలను జాయినింగ్ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు 10 మంది సభ్యులతో సవరించిన కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నాయకత్వం వహించనున్నారు.