
బోల్డ్ క్యారెక్టర్లు, వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో.. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చేదు, దారుణమైన అనుభవాన్ని పంచుకుని షాక్ ఇచ్చారు. గతంలో ఒక సినిమాలోని బోల్డ్ సన్నివేశం లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని చెప్పుకొచ్చారు., పర్సనల్ లైఫ్‌లో భద్రతా సమస్యలను ఎదుర్కొన్నానని వెల్లడించారు.
ఆ క్లిప్ లీక్ అయిన తర్వాత ఏకంగా నాలుగు రోజుల పాటు భయంతో ఇంట్లోంచి కాలు బయట పెట్టలేకపోయానని రాధికా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఆన్ లైన్ లో కామెంట్స్ చేయడం వేరు, కానీ ఆ ప్రభావం మన ఇంటి డోర్ తట్టడం వేరు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేదాన్ని. ఎవరైనా కోపంతో వచ్చి డోర్ బెల్ కొడతారేమోనని రోజూ భయంతో వణికిపోయాను అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఆ లీక్డ్ వీడియో తన చుట్టూ ఉన్నవారి మనస్తత్వాలను ఎలా మార్చేసిందో వివరించారు. “నా డ్రైవర్ రోజూ ఆ క్లిప్ చూసేవాడు..అంతేకాదు ‘నువ్వు రాధికా ఆప్టే ఇంటికే వెళ్తున్నావా?’ అని కొందరు నా డ్రైవర్ ని ఆడిగేవారట. చివరికి మా బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా ఆ వీడియో చూశాడు. అంతా నరకంలా అనిపించింది అని స్పష్టం చేశారు.
ఈ పరిస్థితితో భయపడిన రాధికా.. తన ప్రైవేట్ సేఫ్టీ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పర్సనల్ డ్రైవర్, పర్సనల్ అసిస్టెంట్లను పిలిచి,.. లీక్ అయిన ఆ క్లిప్‌ను మీకు పంపుతున్నాను. అది చూశాక కూడా నాకు రక్షణగా ఉంటామంటే ఉండండి, లేదంటే ఇప్పుడే జీతం తీసుకుని వెళ్ళిపోండి అని నిర్మొహమాటంగా చెప్పేశారు. అయితే వారు ఆమెకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలవడంతో ఆ క్లిష్ట సమయం నుండి బయటపడగలిగానని తెలిపింది.
ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 3’లో విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన ‘హస్బెండ్ స్వాప్’ సెగ్మెంట్‌లో విజయ్ వర్మతో కలిసి నటించి అలరిస్తోంది.