Reading Time: < 1 minute
Ys Jagan New Look Goes Viral Former Andhra Pradesh Cm Leaves For Europe Tour

YS Jagan New Look: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఆయన కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం యూరప్‌కు ఆయన బయల్దేరారు.

బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు వెళ్లిన ఆయన, ఈ టూర్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండు వారాల పాటు ఈ యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ ట్రిప్‌లో ఆయన కుటుంబంతో కలిసి వివిధ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్య కొంత విశ్రాంతి కోసం ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి.