Reading Time: < 1 minute
Trump Warning Iran No More Nice Guy Hormuz Crisis

Donald Trump: రెండో రౌండ్ ఇరాన్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయడంపై ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించకపోతే, ఇకపై మంచివాడిలా వ్యవహరించడం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. సోమవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ అధికారులు సమావేశం కానున్నట్లు వెల్లడిడించారు.

Read Also: Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు జరపడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది కాల్పుల విరమణను ఉల్లంఘించడమే అని అన్నారు. ఇరాన్ ఫ్రెంచ్, యూకే నౌకలపై దాడులు చేసిందని, ఇది మంచి పనికాదు అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో అన్నారు. హార్ముజ్‌ను మూసేయడం వల్ల ఇరాన్‌కే రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టమని చెప్పారు. అమెరికాకు ఏం నష్టం లేదని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు ప్రస్తుతం నౌకలు వస్తున్నాయని అన్నారు. తాము ప్రతిపాదించే డీల్‌కు ఇరాన్ ఒప్పుకోకపోతే ప్రతీ విద్యుత్ కేంద్రం, వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. గత 47 ఏళ్లుగా యూఎస్ మాజీ అధ్యక్షులు ఇరాన్ విషయంలో ఎప్పుడో చేయాల్సిన పనిని తాను చేస్తానని వెల్లడించారు. ఇరాన్ కిల్లింగ్ మిషన్ అంతం కావాల్సిన సమయం ఆసన్నమైందని పోస్టులో పేర్కొన్నారు.