Reading Time: < 1 minute
Rajnath Singh Warning Pakistan Defence Minister Kolkata Threat 1971 Remembrance

Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమపై దాడి చేస్తే, ఈసారి కోల్‌కతా‌పై దాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే, ఈయన వ్యాఖ్యలకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి, పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే, ఆ దేశం ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలన్నారు.

Read Also: Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

‘‘పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసి ఉండకూడదు. 55 ఏళ్ల క్రితం పాకిస్తార్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి వారు బెంగాల్‌పై కన్నేస్తే ఆ దేశం ఎన్ని భాగాలుగా విడిపోతుందో దేవుడికే తెలియాలి’’అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

పాకిస్తాన్‌పై నిందలు మోపడానికి భారత్ ఒక ‘‘ఫాల్స్-ఫ్లాగ్ ఆపరేషన్’’ ప్లాన్ చేస్తోందని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి దిగితే పాకిస్తాన్ కోల్‌కతాపై కూడా దాడి చేయవచ్చని హెచ్చరించారు. భారత్ చేసే ఏ చర్యకైనా పాకిస్తాన్ నుంచి అపూర్వమైన, వేగవంతమైన, నిర్ణయాత్మక ప్రతీకారం ఉంటుందని బెదిరించే ప్రయత్నం చేశారు. ఖ్వాజా ఆసిఫ్‌కు ముందు భారతదేశంలో పాక్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ అణ్వాయుధాలకు ముప్పు వాటిల్లితే, తమపై ఎవరైనా దాడులు చేస్తే, పాకిస్తాన్ ముంబై, న్యూఢిల్లీలపై దాడులు చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.