Reading Time: < 1 minute
Dhurandhar 2 Release Yami Gautam Surprise Cameo Shazia Bano Details

Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వెండితెరపై మరోసారి అద్భుతం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనుంది. అయితే, ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఒక ‘సీక్రెట్ ఎలిమెంట్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే.. అందాల నటి యామీ గౌతమ్ ఎంట్రీ!

READ ALSO: SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..

యామీ గౌతమ్ సర్ప్రైజ్ ఎంట్రీ..
గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ సినిమాలో యామీ గౌతమ్ ఒక మెరుపు తీగలా మెరవబోతున్నట్లు సమాచారం. ఆమె ‘షాజియా బానో’ అనే డాక్టర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎండ్ క్రెడిట్స్ స్క్రీన్‌షాట్లు (YG) ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశాయి. కేవలం అతిథి పాత్రగానే కాకుండా, హీరో మిషన్‌లో ఈ డాక్టర్ పాత్ర అత్యంత వ్యూహాత్మకమైన మలుపుకు కారణం కానుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇందులో విశేషమేమిటంటే, ఈ చిత్రానికి యామీ గౌతమ్ భర్త, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సినిమాలో వచ్చే ఒక కీలక ఆసుపత్రి సన్నివేశంలో యామీ ఎంట్రీ ఉంటుందని, అది ప్రేక్షకులని థ్రిల్‌కు గురిచేస్తుందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఇందులో ‘హమ్జా అలీ మజారీ’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో తన నట విశ్వరూపం చూపించబోతున్నారు. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి హేమాహేమీలు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. ‘ధురందర్’ మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో, ఈ క్రేజీ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్చి 18(నేటి) నుంచే పెయిడ్ ప్రివ్యూలు షురూ కావడంతో, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.

READ ALSO: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌తో సినిమా మా ఐదేళ్ల కల.. ‘ఉస్తాద్’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్: నవీన్ యెర్నేని