Reading Time: 2 minutes

పగలు వెలుతురు ఎంత అవసరమో, రాత్రి చీకటి కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోయే ముందు బెడ్ రూమ్‌లో వాడే బ్రైట్ లైట్స్, స్మార్ట్ ఫోన్ వెలుతురు మనకు తెలియకుండానే మన గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం, రాత్రిపూట ఎక్కువ కాంతిలో ఉండటం వల్ల బాడీలోని ఇంటర్నల్ క్లాక్ డిస్టర్బ్ అయ్యి, హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ పెరుగుతోందట. అసలు లైటింగ్ కి, మన గుండెకి ఉన్న ఆ సీక్రెట్ లింక్ ఏంటో తెలుసుకుందాం.

మన శరీరంలో ‘సర్కాడియన్ రిథమ్’ అనే ఒక నేచురల్ గడియారం ఉంటుంది. ఇది మనం ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు నిద్రలేవాలో డిసైడ్ చేస్తుంది. ఇక సూర్యాస్తమయం తర్వాత కూడా మనం బ్రైట్ లైట్స్ వాడితే, బాడీ ఇంకా పగలే అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్ల హార్మోన్ల బ్యాలెన్స్ తప్పి, మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడుతుంది.

రాత్రిపూట కాంతిలో ఉండటం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. అంతేకాదు, ఇది బ్లడ్ ప్రెషర్‌ని, హార్ట్ రేట్‌ని కూడా అబ్నార్మల్‌గా పెంచుతుంది. ఇక రీసెర్చ్ ప్రకారం, నిద్రపోయేటప్పుడు లైట్స్ ఆన్ చేసి ఉంచే వారిలో గుండెపోటు వచ్చే రిస్క్ కొంత వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది వినడానికి షాకింగ్‌గా ఉన్నా, పచ్చి నిజం.

Sleeping with Lights On? It May Affect Your Heart Health
Sleeping with Lights On? It May Affect Your Heart Health

కేవలం హార్ట్ ఎటాక్ మాత్రమే కాదు, బ్రైట్ లైటింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 30% పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం ఎంత ముఖ్యమో, పడుకునేటప్పుడు ఉండే చీకటి కూడా అంతే ముఖ్యం. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ కూడా దీనికి ఒక ప్రధాన కారణం.

రాత్రిపూట డ్యూటీలు చేసేవారు సహజంగానే లైటింగ్ కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతారు. వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఇతరుల కంటే ఎక్కువే. కానీ నార్మల్ పీపుల్ కూడా బెడ్ మీద ఫోన్ స్క్రోల్ చేయడం లేదా లైట్స్ వేసుకుని పడుకోవడం వల్ల అదే స్థాయి రిస్క్‌ను ఎదుర్కొంటున్నారని స్టడీస్ చెబుతున్నాయి.

చిన్న చిన్న మార్పులతో మన గుండెను కాపాడుకోవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లైటింగ్ తగ్గించడం, నిద్రపోయే గంట ముందు ఫోన్ పక్కన పెట్టడం, కిటికీలకు థిక్ కర్టెన్స్ వాడటం వంటివి చేస్తే మంచిది. ఇక చీకటి అనేది కేవలం నిద్ర కోసం మాత్రమే కాదు, అది మన హార్ట్ హెల్త్ కోసం ఒక మెడిసిన్ లాంటిది.

గమనిక :పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, గుండె సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి (Insomnia) వంటి ఇబ్బందులు ఉన్నవారు కేవలం లైటింగ్ మార్పుల మీద మాత్రమే ఆధారపడకుండా, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

The post రాత్రి వెలుతురు శరీర గడియారాన్ని డిస్టర్బ్ చేస్తుందట.. గుండె జబ్బులకు లింక్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.