Reading Time: 2 minutes

సమ్మర్ వచ్చేసింది! బయట ఎండలు మామూలుగా లేవు, నిప్పులు చెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో బాడీని కూల్‌గా ఉంచుకోవడం ఒక పెద్ద టాస్క్. అయితే మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. “వేసవిలో నేను అన్నీ జాగ్రత్తలే తీసుకుంటున్నాను కదా” అని మీరు అనుకోవచ్చు, కానీ అసలు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో, ఆ డేంజర్ జోన్ నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్.. నిజంగా కూల్ చేస్తాయా?: ఎండలో నుంచి రాగానే ఫ్రిజ్‌లో ఉన్న చిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్ లేదా ఐస్ వాటర్ తాగడం మనలో చాలామందికి అలవాటు. ఇది చూడటానికి హాయిగా ఉన్నా, బాడీకి మాత్రం పెద్ద షాక్! సడన్ గా టెంపరేచర్ మారడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇక దీనికి బదులు కుండ నీళ్లు లేదా నార్మల్ వాటర్ తాగడం బెస్ట్ ఆప్షన్.

కాఫీ, టీలకు కాస్త గ్యాప్ ఇవ్వండి:సమ్మర్‌లో కూడా వేడి వేడి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోండి. వీటిలో ఉండే కెఫీన్ వల్ల బాడీలో ఉన్న నీరు త్వరగా ఆవిరైపోయి (డిహైడ్రేషన్) నీరసం వస్తుంది. ఇక వీటికి బదులు మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా లెమన్ జ్యూస్ తీసుకుంటే ఎనర్జీగా ఉంటుంది.

Avoid These Mistakes in Summer to Stay Healthy
Avoid These Mistakes in Summer to Stay Healthy

ఆ టైమ్‌లో బయటకు వెళ్తున్నారా?: మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది పనులు ఉన్నాయి కదా అని ఆ టైమ్‌లో బయట తిరుగుతుంటారు. దీనివల్ల స్కిన్ అలర్జీలు, హీట్ ఎగ్జాషన్ వచ్చే రిస్క్ ఉంది. ఇక తప్పనిసరి అయితే తప్ప ఆ టైమ్‌లో బయటకు వెళ్లకండి, వెళ్లినా గొడుగు లేదా క్యాప్ వాడటం అస్సలు మర్చిపోవద్దు.

ఫుడ్ విషయంలో జాగ్రత్త: వేసవిలో ఫుడ్ చాలా త్వరగా పాడైపోతుంది. బయట దొరికే మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఈ సీజన్‌లో అస్సలు సెట్ అవ్వవు. ఇవి తింటే కడుపులో మంట, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఫ్రెష్ ఫుడ్, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ (పుచ్చకాయ వంటివి) తీసుకోవాలి.

సింథటిక్ బట్టలు వద్దు.. కాటన్ ముద్దు: స్టైల్ కోసం పాలిస్టర్ లేదా సింథటిక్ బట్టలు వేసుకుంటే చెమట సరిగ్గా బయటకు వెళ్లక బాడీ హీట్ పెరిగిపోతుంది. వేసవిలో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల గాలి తగిలి బాడీ రిలాక్స్ అవుతుంది. ఇక ముదురు రంగుల కంటే లైట్ కలర్స్ ఎంచుకోవడం ఇంకా బెటర్.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిని కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, సరైన ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం అందించబడింది. ఎండ దెబ్బ తగిలినా లేదా విపరీతమైన నీరసంగా అనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది.

The post వేసవిలో జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది appeared first on Manalokam – Latest Telugu News & Updates.