Reading Time: 2 minutes
Lava Bold 2 5g Launched In India Price Specifications 120hz Amoled Display 50mp Camera

Lava Bold 2 5G Launched: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 2 5G (Lava Bold 2 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల FHD+ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7060 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో 6GB RAMతో పాటు అదనంగా 6GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తుంది.

Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

కెమెరా విషయానికి వస్తే 50 MP ప్రధాన కెమెరా (Sony సెన్సర్‌తో)తో పాటు మరో సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీగా 5000mAh సామర్థ్యాన్ని అందించారు. దీనికి 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌గా రూపొందించారు. ఫోన్ మందం కేవలం 7.55mm మాత్రమే. ఈ కొత్త లావా ఫోన్ ఫీథర్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999గా ధర నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 19 నుంచి అమెజాన్ లో అమ్మకలకు అందుబాటులోకి రానుంది.

SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

Image (1)

Lava Bold 2 5G స్పెసిఫికేషన్లు:
* 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ MediaTek Dimensity 7060 (6nm) ప్రాసెసర్
* 6GB RAM + 128GB UFS 3.1 స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్
* 50MP ప్రధాన కెమెరా (Sony సెన్సర్), సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, 8MP ఫ్రంట్ కెమెరా
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
* 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.3, GPS
* 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్.