Reading Time: 2 minutes
Mehidy Hasan Miraz Run Out Salman Ali Agha Controversy Pakistan Bangladesh Match

Salman Ali Agha Run Out Controversy: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో వింత ఘటన జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాను ఔట్ చేయడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్‌ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ ఈ వికెట్ తీశాడు. వికెట్ తీయడంతో తప్పేముంది? వికెట్ తీయడం సంచలనంగా ఎందుకు మారిందనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇక్కడ హసన్ మిరాజ్ వికెట్ తీసిన స్టైల్ గురించి చర్చ మొదలైంది. ఈ ఔట్ క్రీడా స్పూర్తికి విరుద్ధమని మాజీ ప్లేయర్స్ వెల్లడిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో మిరాజ్ బాల్ వేశాడు. మహమ్మద్ రిజ్వాన్ దాన్ని బాదాడు. ఆ బంతిని మిరాజ్ షూతో అడ్డుకున్నాడు. ఆ బాల్ కాస్త నాన్-స్ట్రైకర్ ఆఘా క్రీజు కాలి దగ్గరకు వెళ్లింది. ఆ బాల్‌ను తన చేతితో మిరాజ్‌కు ఇచ్చేందుకు కిందికి వంగాడు ఆఘా.. మిరాజ్ ఆ బాల్‌ను వంగి తీసుకుని వికెట్ల వైపు విసిరాడు. ఆ సమయంలో ఆఘా క్రీజు బయట ఉన్నాడు. వాస్తవానికి ఆఘా బంతిని బౌలర్‌కు ఇవ్వడానికి ఆఘా ప్రయత్నించాడు. కానీ మిరాజ్ ఏమాత్రం కనికరం లేకుండా అవుట్ చేయడంతో థర్డ్ అంపైర్ నిబంధనల ప్రకారం ఆఘాను అవుట్‌గా ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి గురైన సల్మాన్ ఆఘా తన గ్లౌజులు, హెల్మెట్‌ను కోపంతో విసిరేస్తూ పెవిలియన్‌కు చేరాడు.

READ MORE: 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

ఈ అంశంపై కామెంటర్స్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ టీమ్‌లో క్రీడా స్పూర్తి లోపించిందని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ అనంతరం.. మిరాజ్ స్పందించాడు. తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. ఒకవేళ తాను బంతిని వికెట్లపైకి విసరకపోతే ఆఘా కచ్చితంగా పరుగు తీసేవాడని, అందుకే తాను ఆ పని చేశానని స్పష్టం చేశాడు. కానీ వాస్తవానకి ఇక్కడ ఆఘా మాత్రం బాల్‌ను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై మాజీ ప్లేయర్స్, పాకిస్థాన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా డీఎల్ఎస్ (DLS) పద్ధతిలో పాకిస్థాన్ 128 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 274 పరుగులు చేయగా.. వర్షం వల్ల బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించారు. అయితే బంగ్లా జట్టు కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.