Reading Time: 2 minutes

ప్రేమ ఉంటే చాలు, జీవితాంతం కలిసి ఉండొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న జంటలు కూడా మధ్యలోనే విడిపోవడం మనం చూస్తూనే ఉంటాం.”అంత ప్రేమ ఉన్నా వీళ్లు ఎందుకు విడిపోయారు?” అని మనకూ అనిపిస్తుంది. నిజానికి ఒక బంధం నిలబడాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు, అంతకంటే ముఖ్యమైనవి మరికొన్ని ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కమ్యూనికేషన్ గ్యాప్: చాలా రిలేషన్స్‌లో ప్రేమ ఉంటుంది కానీ, మనసులో మాటను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతుంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండటం, లేదా ఎదుటివారు చెప్పేది వినకుండా వాదించడం వల్ల దూరం పెరుగుతుంది. ఇక సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్లే సగం బంధాలు తెగిపోతున్నాయి.

నమ్మకం సడలడం: ప్రేమకు పునాది నమ్మకం. ఒక్కసారి అనుమానం మొదలైతే, ఎంత గాఢమైన ప్రేమ ఉన్నా ఆ బంధం భారంగా మారుతుంది. ఒకరి పర్సనల్ స్పేస్‌ను మరొకరు గౌరవించకపోవడం, ఎప్పుడూ నిఘా పెట్టినట్లు ప్రవర్తించడం వల్ల రిలేషన్ ఊపిరాడనట్లు అయిపోతుంది. ఇక దీనివల్ల ప్రేమ ఉన్నా సరే, ఆ బంధం నుంచి బయటపడాలనిపిస్తుంది.

Love Isn’t Always Enough: Top Reasons Relationships End
Love Isn’t Always Enough: Top Reasons Relationships End

ప్రాధాన్యతలు మారడం:వృత్తిపరమైన లక్ష్యాలు, వ్యక్తిగత ఇష్టాలు మారినప్పుడు కూడా సమస్యలు వస్తాయి. ఒకరు కెరీర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, పార్ట్‌నర్‌కు టైమ్ ఇవ్వలేనప్పుడు అవతలి వ్యక్తి ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇక ప్రేమ ఉన్నా కూడా తమకు టైమ్ దొరకడం లేదనే అసంతృప్తి మెల్లమెల్లగా విడిపోవడానికి దారి తీస్తుంది.

గౌరవం లేకపోవడం: ప్రేమ ఉన్న చోట గౌరవం లేకపోతే ఆ బంధం ఎంతో కాలం నిలబడదు. మాటలతో కించపరచడం, ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తే మనసు విరిగిపోతుంది. ఎదుటి వ్యక్తిని ఒక మనిషిగా గౌరవించలేనప్పుడు, కేవలం ప్రేమ ఉంది కదా అని ఎవరు భరించలేరు. ఇక అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చాలామంది బ్రేక్ అప్ వైపు మొగ్గు చూపుతారు.

ప్రేమ అనేది బంధానికి ఆరంభం మాత్రమే, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఓపిక, నమ్మకం, గౌరవం చాలా అవసరం. ఎదుటివారిని అర్థం చేసుకుంటూ, వారితో క్వాలిటీ టైమ్ గడిపినప్పుడే ఏ రిలేషన్ అయినా కలకాలం నిలుస్తుంది.

The post లవ్ ఉన్నా రిలేషన్ బ్రేకప్ ఎందుకు? నిపుణులు చెప్పే కారణాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.