Reading Time: 2 minutes
నీ స్మైల్ అదుర్స్.. కానీ, డగౌట్‌లో ఎందుకంత సీరియస్.. ధోని ప్రశ్నకు గంభీర్ షాకింగ్ ఆన్సర్..!

MS Dhoni Gautam Gambhir Post: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజయం సాధించిన తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో జట్టును అభినందించారు. తన పోస్టులో ధోనీ కోచ్ గౌతమ్ గంభీర్‌ను సరదాగా అభినందిస్తూ, “మీ చిరునవ్వు చాలా బాగుంది. సీరియస్‌నెస్‌తో పాటు స్మైల్ ఉంటే అది ఘాటు కాంబినేషన్” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

నవ్వడం కష్టమని చెప్పిన గంభీర్..

ఈ వ్యాఖ్యలపై స్పందించిన గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు ప్రతినిధ్యం వహించడం ఎంతో పెద్ద బాధ్యత అని, ముఖ్యంగా వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. “డగౌట్‌లో చాలా విషయాలు నడుస్తుంటాయి. భారత జట్టుపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి సమయంలో నవ్వాలనిపించినా నవ్వలేం” అని గంభీర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా

భారత క్రికెట్‌లో అంచనాల ఒత్తిడి..

భారత క్రికెట్ అభిమానులు జట్టుపై చాలా ఆశలు పెట్టుకుంటారని గంభీర్ చెప్పారు. భారత్ వంటి దేశంలో ఓటమి అంగీకరించరని, అయినప్పటికీ క్రికెట్‌లో ఓటమి సహజమేనని ఆయన పేర్కొన్నారు. “ఓటమి అసలు జరగదని అనుకుంటే భారత్ అన్ని వరల్డ్ కప్‌లను గెలిచేది. కానీ ఆటలో అలాంటిది జరగవు” అని ఆయన అన్నారు.

వరల్డ్ కప్‌లో టీమిండియా చరిత్ర..

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇదే కాకుండా స్వదేశంలో ఈ టోర్నీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అలాగే మొత్తం మూడు సార్లు (2007, 2024, 2026) టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

ఇది కూడా చదవండి: 2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

గంభీర్ సీరియస్ స్వభావం వెనుక అసలు కారణం..

గౌతమ్ గంభీర్ ఎప్పుడూ సీరియస్‌గా కనిపించడం క్రికెట్ అభిమానులకు కొత్త విషయం కాదు. ఆటగాడిగా ఉన్నప్పుడు నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా, ఇప్పుడు టీమిండియా కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన అదే తీరు కొనసాగించారు. జట్టు విజయాల సమయంలో కూడా ఆయన చాలా శాంతంగా ఉండటం వల్ల అభిమానులు సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..