
కోలీవుడ్ స్టార్ హీరో , టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ వ్యక్తగత జీవితం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకపై రాజకీయ విమర్శలతో సతమతమవుతుండగా.. ఇప్పుడు తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం , లేటెస్ట్ గా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెరపైకి రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇటీవల జరిగిన ఒక రిసెప్షన్ వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం, వేదికపై నూతన వధూవరులను విష్ చేయడం, ఫోటోలకు కలిసి పోజులివ్వడం వంటివి వైరల్ అయ్యాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘గిల్లీ’, ‘కురువి’, ‘లియో’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అయితే ఈ సాన్నిహిత్యం కాస్తా రిలేషన్‌షిప్‌గా మారిందంటూ పుకార్లు షురూ అయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న కీలక సమయంలో ఈ వివాదం ఆయన ఇమేజ్‌కు ఇబ్బందిగా మారింది.
పార్తిబన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వివాదం నడుస్తుండగానే, సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక అవార్డు వేడుకలో త్రిష ఫోటోను చూపిస్తూ.. ‘పొన్నియిన్ సెల్వన్’లోని ఆమె పాత్రను ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. అలా చేస్తే ఎలాంటి సమస్యలు రావు అని అన్నారు. ఇది విజయ్-త్రిషల డేటింగ్ వార్తలను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
எது நடந்ததோ
அது தவறாகவே
நடந்துள்ளது இதில்.
வருந்துவதைத் தவிர
வேறு வழியில்லை !https://t.co/pOTDcx1QR8— Radhakrishnan Parthiban (@rparthiepan) March 8, 2026
త్రిష ధీటైన సమాధానం
పార్తిబన్ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. పేరు ప్రస్తావించకుండానే.. చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన చేసే కామెంట్స్ తెలివైనవిగానో, హాస్యంగానో మారిపోవు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తుంది అంతే అంటూ కౌంటర్ ఇచ్చింది.
I was informed by the organisers of a recent event that my name and picture were included at the last minute at the request of an individual conveyed through his assistant.
A microphone doesn’t make a comment intelligent or humorous. It just makes stupidity louder.Crude words…— Trish (@trishtrashers) March 8, 2026
పార్తిబన్ యూ-టర్న్
ఈ విషయం తీవ్రం కావడంతో పార్తిబన్ దిగివచ్చారు. తాను సరదాగానే అన్నానని, ఎవరినీ నొప్పించాలని కాదని చెబుతూ సోషల్ మీడియాలో క్షమాపణలు కోరారు. “సారీ చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదు” అని ఆయన పోస్ట్ చేయడంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.
ఇక సంగీత ప్రస్తుతం విజయ్ ఉంటున్న చెన్నై నివాసంలో ఉండేందుకు కోర్టు ఉత్తర్వులు కోరడం, విడాకుల పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.