Reading Time: < 1 minute
UPSC Civil Services Results 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాపర్స్ ఫుల్ లిస్ట్ ఇదిగో!

హైదరాబాద్‌, మార్చి 6: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలు శుక్రవారం (మార్చి 6) మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఆగస్ట్ 2025న జరిగిన మెయిన్స్‌ పరీక్షలు జరగగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజా ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్ధులు అఖిల భారత సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు. అనుజ్ అగ్నిహోత్రి యూపీఎస్సీ ఫలితాల్లో 2025 ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. రాజేశ్వరి సువే సెకండ్‌ ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ థార్డ్‌ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొత్తం మొత్తం 1087 ఖాళీలలో 42 PwBD కేటగిరీకి కేటాయించారు. ఎంపికైన వారికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), గ్రూప్ ‘A’, గ్రూప్ ‘B’ వంటి వివిధ కేంద్ర సర్వీసులను కేటాయిస్తారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

యేటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ నియామకాలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో అంటే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎంతో కఠినమైన వడపోత తర్వాత అంతిమంగా ఎంపికైన వారి జాబితాను కమిషన్‌ విడుదల చేస్తుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారు ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి కీలక విభాగాల్లో కేంద్ర సర్వీసులకు ఎంపికవుతారు.

UPSC తుది ఫలితం 2025 టాపర్స్ లిస్ట్..

  • అనుజ్ అగ్నిహోత్రి
  • రాజేశ్వరి సువే M
  • అకాన్ష్ ధుల్
  • రాఘవ్ ఝుంఝుంవాలా
  • ఇషాన్ భట్నగర్
  • జిన్నియా అరోరా
  • అర్ రాజా మొహైదీన్
  • పక్షల్ సీక్రెట్
  • అస్తా జైన్
  • ఉజ్వల్ ప్రియాంక్

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.