
అనంతపురం: ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ముదిగలకు చెందిన చెల్లెలు చంద్రకళ(32), తన సోదరులు శివకుమార్(36), హనుమంత రాయుడు(40) కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టిసి బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. కర్ణాటకలోని మొలకల్మూర్‌లో జరిగే వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డిఎస్పి రవిబాబు, సిఐ హరినాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహఆలను పోస్టుమార్టం నిమిత్తం కలంద్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.