Reading Time: < 1 minute

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో భారత చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన అలీసా హేలీ 158 పరుగులతో చెలరేగిపోగా, బెత్ మూనీ 106, జార్జియా వొల్ 62, నికోలా కేరీ 34 పరుగులు సాధించారు. ఆ తర్వాత భారీ లక్ష్య చేధనలో భారత్ తీవ్రంగా తడబడింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. భారత బ్యాటింగ్‌లో స్నేహ్ రానా 44, జెమీమా 42 పరుగులు చేయగా మిగితా వాళ్లంతా స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.