Reading Time: < 1 minute
Tata Motors Beats Hyundai Mahindra Secures No 2 Spot In February 2026 Car Sales With 35 Growth

Tata Motors February Sales: టాటా మోటార్స్(Tata Motors) సత్తా చాటింది. ఫిబ్రవరి అమ్మకాల్లో రెండో స్థానాన్ని సాధించింది. దేశీయ ఆటోమేకర్ టాటా మరోసారి తన బలమైన మార్కెట్ ఉనికిని చాటిచెప్పింది. ఫిబ్రవరి 2026 అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అనూహ్యంగా మంచితీరును కనబరిచింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 63,331 కార్లను విక్రయించింది. హ్యుందాయ్, మహీంద్రాలను అధిగమించింది.

మొత్తం 63,331 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2025లో, ఈ సంఖ్య 46,811 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే సేల్స్ 35 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కొత్త మోడళ్లను టాటా తీసుకురావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. టాటా హారియర్ పెట్రోల్, హారియర్ ఎలక్ట్రిక్, టాటా సఫారీ పెట్రోల్, టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి అమ్మకాల బలాన్ని పెంచాయి.

ఎలక్ట్రిక్ కార్‌ మార్కెట్‌లో టాటా ఇప్పటికే అగ్రగామిగా ఉంది. టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హారియర్ ఈవీలు ఉన్నాయి. మొత్తం ఈవీ సేల్స్‌లో 57 శాతం టాటా కార్లే ఉన్నాయి. సేఫ్టీతో పాటు టెక్ ఫీచర్లకు కూడా టాటా ప్రాధాన్యత ఇస్తుండటంతో వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. విదేశీ మార్కెట్లలో కూడా టాటా కార్లకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల ఎగుమతులు ఏకంగా 167% వృద్ధి చెందాయి.

ఫిబ్రవరి కార్ సేల్స్ వివరాలు:

1) మారుతి సుజుకి: 1.64 లక్షలు
2) టాటా మోటార్స్: 62,329
3) మహీంద్రా: 60,018
4) హ్యుందాయ్: 52,407