Reading Time: < 1 minute
Smit Machchhar Netanyahu Israel Independence Day Invitation

ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ దాడిని అడ్డుకుని 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో మచ్చర్ చూపించిన ధైర్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. ‘‘ఇజ్రాయిల్, భారత్‌తో పాటు ప్రపంచానికి హీరో’’గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కోపైలట్ కూల్చే ప్రయత్నం చేశాడు. అతడిని హమామ్ అల్ హమ్మామీగా గుర్తించారు.

శనివారం స్మిత్‌తో ఫోన్‌లో మాట్లాడిన నెతన్యాహూ ఇజ్రాయిల్ స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ గౌరవం సాధారణంగా ఇజ్రాయిల్ పౌరులకు మాత్రమే దక్కుతుందని, అయితే మచ్చర్ విషయంలో ఇజ్రాయిల్ ప్రజలంతా ఆయనను తమవాడిగా స్వీకరించారని అన్నారు.

తాను ఎలాంటి దాడిని తట్టుకుని విమానాన్ని రక్షించాననే విషయాన్ని మచ్చర్ నెతన్యాహూకు వెల్లడించారు. మచ్చర్ చెప్పిన వివరాలు విన్న నెతన్యాహూ ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. మీ ధైర్యానికి ఆశ్చర్యపోయానని, అసాధారణ పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకున్న తీరు తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని ప్రశంసించారు. మచ్చర్‌కు తన భార్య తరుఫున నెతన్యాహూ శుభాకాంక్షలు తెలిపారు.