
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై అలరిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో చేసిన ఒక పెద్ద పొరపాటు గురించి ఆమె ఈ సందర్భంగా నిర్మొహమాటంగా మాట్లాడారు. సినీ పరిశ్రమలో తన కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలో వివాహం చేసుకోవడం తన అతిపెద్ద తప్పుగా ఆమని అభివర్ణించారు. ఇది లవ్ మ్యారేజ్ కాదని, ఒక అవగాహనతో చేసుకున్న “లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్” అని ఆమె తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
ఆమని భర్త కాజా మైదీన్ తమిళ చిత్ర నిర్మాత అని, ఆయనతో కలిసి ఏడెనిమిది సంవత్సరాలు జీవించినట్లు ఆమె చెప్పారు. మొదట్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆయనపై నమ్మకం కుదిరిందని, ఆయన్ని మంచి హస్బెండ్, మంచి మనసున్న మనిషిగా భావించానని ఆమని అన్నారు. అయితే, తనకున్న సినిమా పిచ్చి వల్లే సమస్యలు మొదలయ్యాయని ఆమె వివరించారు. తాను మళ్ళీ సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు, ఆయన అందుకు ఒప్పుకోలేదని, సినిమా వద్దు అన్నారని ఆమని పేర్కొన్నారు. సినిమా అంటే తనకెంతో ఇష్టమని, ఎన్నో మంచి క్యారెక్టర్లు చేసి, ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న తనకు ఇలా కట్టిపడేసినట్టు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భర్త సినిమా మనిషే అయినా, ఆయనకు సినిమా అంటే ప్యాషన్ ఉన్నా, నన్ను సినిమాకి పంపించాలి అని ఎందుకో అనిపించలేదని ఆమని ప్రశ్నించారు. మొదట్లో “సినిమా చేయొద్దు” అనే కండిషన్‌ను అంగీకరించినప్పటికీ, అది అప్పటికి సరైన నిర్ణయంగా అనిపించినా, తర్వాత తప్పు అనిపించిందని ఆమె ఒప్పుకున్నారు. తన తల్లి మాత్రం మొదటి నుంచీ ఈ పెళ్లి వద్దని చెప్పినట్లు ఆమని గుర్తుచేసుకున్నారు. ఆరేడేళ్ల వైవాహిక జీవితం తర్వాత తాను ఒంటరితనం అనుభవించానని, భర్త తన ప్రొడక్షన్ పనుల్లో నిత్యం బిజీగా ఉండేవారని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
ఈ వివాహ బంధం నుండి విడిపోయి పదేళ్లు అయిందని, తమకు ఇద్దరు పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారని, వారే తన ప్రపంచం అని ఆమని స్పష్టం చేశారు. తన భర్త కూడా తిరిగి పెళ్లి చేసుకోలేదని, ఆయనకూ పిల్లలే ప్రపంచమని, కానీ ఆయనకు సినిమా కూడా ప్రపంచమని ఆమని అభిప్రాయపడ్డారు. సినిమా పట్ల ఆమెకున్న అచంచలమైన ప్రేమ, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, దాని పరిణామాలను ఆమని ఈ ఇంటర్వ్యూలో ధైర్యంగా పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..