Reading Time: < 1 minute
Rahul Gandhi Was Scared Of Raebareli Contest Says Sp Mp Shiv Pal Singh Patel

Rahul Gandhi:  2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయడానికి భయపడ్డారని, ఒకానొక దశలో పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, అఖిలేష్ యాదవ్ హామీ తర్వాతే అక్కడ నుంచి పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి పోటీలో నిలబడే వారని అన్నారు.

2024 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడిన చోట ఎస్పీ ఓటర్లు వారికి ఓటేశారని అన్నారు. దీని వల్లే కాంగ్రెస్‌కు యూపీలో 6 లోక్‌సభ సీట్లు గెలిచిందని అన్నారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ 37 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 33 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 36 స్థానాలు గెలిచింది.

2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు కోరుతుండటంపై శివపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ అని అన్నారు. పొత్తుకు కాంగ్రెస్ సహకరించాలని, అసంబద్ధ లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. యూపీలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మణుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముస్లింను నియమించడం పెద్దగా ప్రయోజనం చేయదని ఆయన అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు ఎస్పీనే ‘‘పెద్దన్న’’ అని, ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని అన్నారు. పొత్తు ఉంటే కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉంటుందని, లేకపోతే ఎస్పీకి పెద్దగా నష్టం ఉండదని అన్నారు.