Reading Time: < 1 minute
ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

India vs West Indies: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచినా, చివరి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి జట్టులోని కొన్ని బలహీనతలను బయటపెట్టింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్.. ఐదు వికెట్ల తేడాతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఓడింది. ఈ ఫలితంపై సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లు.. ఏ దశలోనూ బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోవడం సమస్యగా మారిందని పేర్కొన్నారు.

భారత బౌలింగ్‌లో ఒక్కరు కూడా తక్కువ ఎకానమీతో పూర్తి స్పెల్ వేయలేకపోయారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మూడో వన్డేలో అర్షల్ కాంబోజ్ తొమ్మిది ఓవర్లలో 80కి పైగా పరుగులు ఇచ్చారు. సిరీస్ మొత్తంలో గుర్నూర్ బార్ మూడు మ్యాచ్‌లలో 253 పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో ఇదే అత్యధికం.

బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పైనా గవాస్కర్ దృష్టి పెట్టారు. క్యాచ్‌లు చేజారడం మ్యాచ్ ఫలితంపై నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన సూచించారు. ప్రపంచకప్‌నకు ముందు ఈ విభాగాన్ని మెరుగుపరచడం చాలా అవసరమని చెప్పారు. ఒక క్యాచ్ చేజారడం వల్ల మ్యాచ్ ఫలితం మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బ్యాటింగ్ విభాగంలో భారత్ బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మరింత మెరుగుదల అవసరమని గవాస్కర్ స్పష్టం చేశారు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు.

ప్రపంచకప్ సన్నాహకాలపై మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), అక్షర్ పటేల్ (Axar Patel) వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉండాలని గవాస్కర్ అన్నారు. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలోని అంతర్జాతీయ పిచ్‌లు స్వదేశీ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు. కనీసం ఒక బౌలర్ అయినా పరుగులను నియంత్రించే స్థాయిలో బౌలింగ్ చేయకపోతే ప్రపంచకప్‌లో విజయం సాధించడం కష్టమని హెచ్చరించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..