Reading Time: 2 minutes
Vijay Deverakonda: ఎవరిని వదిలిపెట్టకూడదు.. మళ్లీ అలా చేయాలంటే గుణపాఠం కావాలి.. విజయ్ దేవరకొండ..

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రంలోని చుట్టమల్లె పాట వివాదం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ ఇష్యూపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కటిగా పోరాడాలని సూచించారు. ఇక ఇదే విషయంపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం స్పందించారు. ఏఐ టెక్నాలజీతో జరుగుతున్న విపరీతమైన సంస్కృతిపై ఆయన మండిపడ్డారు. మనం పూర్తిగా నీచ స్థాయికి దిగజారామని.. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదని.. ఇంలాటి అత్యంత కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొవాలని.. ఇదే విషయం ఇతరులకు ఒక గుణపాఠంగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

“మనం పూర్తిగా నీచ స్థాయికి దిగజారాము. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదు. వారు అత్యంత కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాలి మరియు ఇతరులకు ఒక గుణపాఠంగా నిలవాలి. మనం దీనిని ఉపేక్షించకూడదు. మనం ఒకరిపట్ల ఒకరం ఎప్పుడు ఇంత సున్నితత్వం లేకుండా తయారయ్యాము? ఇది ఎలాంటి పెంపకం? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాము? ఒకరినొకరు కించపరచుకోవడంలో ఆనందాన్ని పొందే సమాజంలోనా? ప్రపంచం మొత్తం AI జీవనోపాధులను ఎలా దెబ్బతీస్తుందో, ఉద్యోగాలను ఎలా లాగేస్తుందో అని చర్చించుకుంటూ, భయపడుతున్న తరుణంలో, ఈ మూర్ఖులు అదే టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా అర్థంలేని పనులు చేస్తున్నారు. ఇది డిజిటల్ రూపంలో జరిగిన దాడి. చట్టం ఇటువంటి చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణించాలి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన బృందానికి నా పూర్తి మద్దతు ఉంది.” అంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

కాగా ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని చుట్టమల్లె పాటను ఏఐతో అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

విజయ్ దేవరకొండ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..