July 18, 2026

హిందుత్వ నినాదాలు ఉన్న ఆటోను నడిపి కొత్త ఆటో కూడా కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్

హిందుత్వ నినాదాలు ఉన్న ఆటోను నడిపి కొత్త ఆటో కూడా కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Reading Time: < 1 minute

హిందుత్వ నినాదాలు ఉన్న ఆటోను నడిపి కొత్త ఆటో కూడా కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Caption of Image.

కరీంనగర్: ఆటోపై హిందుత్వ నినాదాలు ఉన్నాయనే కారణంగా హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఆటోపై, ఆటో డ్రైవర్ భరత్పై జరిగిన దాడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందుత్వ నినాదాలు రాసి ఉన్న ఆటోను కరీంనగర్ నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా నడిపారు. అంతేకాదు.. భరత్‌కు కొత్త ఆటోను కూడా కొనిచ్చారు. కరీంనగర్‌లో సుమారు 5 కిలో మీటర్లు హిందుత్వ నినాదాలు రాసి ఉన్న ఆటోను బండి సంజయ్ స్వయంగా నడిపారు.

జ్యోతినగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు ఆటోలో పర్యటించారు. పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను భరత్‌కు కేంద్ర మంత్రి ఇచ్చారు. హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న భరత్‌ను ఆయన అభినందించారు. భరత్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆటోపై ఉన్న నినాదాలను గీకేసినట్లు భరత్ ఆరోపించాడు. కొత్త ఆటో కొనిచ్చి ఇచ్చిన మాటను బండి సంజయ్ నిలబెట్టుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.