July 18, 2026

Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Reading Time: < 1 minute
Telangana Indiramma Urban Housing Scheme 2bhk Single Window Tghb

Telangana Approves Indiramma Urban Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తూ ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన (EWS), అల్పాదాయ (LIG) వర్గాల కోసం 2-BHK (రెండు పడక గదుల) తరహాలో సరసమైన ధరల్లో నాణ్యమైన ఇళ్లను నిర్మించేందుకు ఈ ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ద్వారా ఈ సరసమైన పట్టణ గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియలను మరింత సులభతరం చేస్తూ గృహాల అనుమతుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక ‘సింగిల్ విండో కమిటీ’ (TGHB Affordable Urban Housing Single Window Committee) ని ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా అనుమతుల జాప్యం లేకుండా వేగవంతమైన సేవలు అందనున్నాయి. అలాగే నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ‘బిల్డ్‌నౌ వర్క్‌ఫ్లో’ (BuildNow Workflow) అనే ప్రత్యేకమైన అనుమతుల ప్రక్రియను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ చార్జీల నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. ప్రణాళిక అనుమతులకు సంబంధించిన ఎలాంటి ఫీజులను వసూలు చేయవద్దని, వాటిని పూర్తిగా మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ విద్యాశాఖ/హౌసింగ్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాయితీలు, సులభతరమైన అనుమతుల ద్వారా పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లను సకాలంలో, అందుబాటు ధరల్లో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.