July 18, 2026

ఎన్ని షాంపూలు మార్చినా చుండ్రు పొవట్లేదా…? ఇదే అసలు కారణం…!

ఎన్ని షాంపూలు మార్చినా చుండ్రు పొవట్లేదా...? ఇదే అసలు కారణం...!
Reading Time: 2 minutes

ఎన్ని షాంపూలు మార్చినా చుండ్రు పొవట్లేదా…? ఇదే అసలు కారణం…!

Caption of Image.

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య చుండ్రు. చుండ్రు జుట్టును దెబ్బతీయడమే కాకుండా మానసికంగా కుంగదీస్తుంది కూడా. జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు ఒకటి. ఈ సమస్య నుండి బయటపడటం కోసం కనపడిన ప్రతి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటం మొదలుకొని… డాక్టర్ ను సంప్రదించడం వరకు అన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి చుండ్రు పోదు. ఎంత ప్రయత్నించినా చుండ్రు వదలకపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుభ్రత లోపించడమే అన్ని సందర్భాల్లో చుండ్రు సమస్యకు కారణం కాకపోవచ్చు. మన స్కాల్ప్ మీద జరిగే బాక్టీరియా రియాక్షన్ కూడా చుండ్రు రావడానికి కారణమని అంటున్నారు నిపుణులు. స్కాల్ప్ మీద ఉండే న్యాచురల్ ఆయిల్స్, సూక్ష్మజీవులు, చర్మం మీద ఉండే రక్షణ పొర ఆరోగ్యం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు నిపుణులు. 

చాలా మందికి, చుండ్రు అంత పెద్ద సమస్య కాదు.. భుజాలపై కొన్ని తెల్లటి పొరలు, అప్పుడప్పుడు తల దురద, అంతే. చుండ్రు పదేపదే రావడం అనేది, మన తలపై ఏం జరుగుతుందో మనం సరిగ్గా అర్థం చేసుకోలేదనడానికి ఒక సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మలాసెజియా అనే సూక్ష్మజీవి కూడా చుండ్రు సమస్యకు కారణమని అంటున్నారు.

మలాసెజియా: తల చర్మంపై నివసించే సూక్ష్మజీవి

మలాసెజియా అనేది బయటి నుండి సోకే ఇన్ఫెక్షన్ కాదు. ఇది దాదాపు ప్రతి ఒక్కరి తలపై సహజంగా ఉండే ఒక యీస్ట్. సాధారణ పరిస్థితులలో, ఇది చర్మంతో కలిసి జీవిస్తుంది.. ఎటువంటి సమస్యలను కలిగించదు.

Also Read : ఉన్నవి చాలవన్నట్టు మళ్లీ ఇదోటి..

చుండ్రు అనేది తలకు సంబంధించిన సాధారణ సమస్యలలో ఒకటి, మలాసెజియా గ్లోబోసా అనే హానిచేయని, ఈస్ట్ లాంటి సూక్ష్మజీవి వల్ల చుండ్రు వస్తుంది.. ఇది సహజంగా ప్రతి ఒక్కరి తలపై ఉంటుంది.

వాతావరణ మార్పుతో సమస్య:

వేడి, తేమ, అధిక నూనె ఉత్పత్తి, చెమట, కాలుష్యం, ఒత్తిడి, షాంపూ, నూనెల అవశేషాలు కూడా మలాసెజియా వేగంగా వృద్ధి చెందడానికి కారణం అవుతాయి. ఈ ఈస్ట్, తల చర్మం ఉత్పత్తి చేసే సహజ నూనె అయిన సెబమ్‌ను ఆహారంగా తీసుకుంటూ, ఆ నూనెలను తల చర్మానికి చికాకు కలిగించే ఉప-ఉత్పత్తులుగా విడగొడుతుంది. దీంతో చర్మం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కోల్పోయి దురద మొదలవుతుంది.

చుండ్రు ఎందుకు పదేపదే వస్తుంది

చుండ్రు సమస్యకు కారణమేంటో తెలుసుకోకుండా కేవలం చర్మం పొరలను క్లీన్ చేయడం వల్లే పదే పదే వస్తుంది. షాంపూ తాత్కాలికంగా కనిపించే పొరలను కడిగివేయవచ్చు, దీనివల్ల తల చర్మం కొన్ని రోజుల పాటు శుభ్రంగా కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఉన్న చుండ్రు అలాగే ఉంటే, మళ్ళీ తిరిగి వస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • స్కాల్ప్ ను క్రమం తప్పకుండా, ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టిన తర్వాత కడుక్కోవాలి.
  • చెమట, నూనె అవశేషాలు పేరుకుపోకుండా చూసుకోవాలి.
  • హెల్మెట్లు, టోపీలు హెయిర్ యాక్సెసరీస్ శుభ్రంగా ఉంచుకోవాలి.
  • తడి జుట్టును ఎక్కువ సేపు కట్టి ఉంచడం మానుకోవాలి.
  • ట్రెండ్‌లను బట్టి కాకుండా, మీ స్కాల్ప్ రకాన్ని బట్టి హెయిర్ ప్రాడక్ట్స్ వాడాలి.
  • స్ట్రెస్ తెగ్గించుకోవాలి… కొంతమందిలో ఇది కూడా చుండ్రు పెరగడానికి కారణం కావచ్చు.
     
©️ VIL Media Pvt Ltd.