July 18, 2026

హైదరాబాద్లో ఉన్నట్టుండి వర్షం.. ఈ ఏరియాల్లో గ్యాప్ లేకుండా పడుతనే ఉంది..

హైదరాబాద్లో ఉన్నట్టుండి వర్షం.. ఈ ఏరియాల్లో గ్యాప్ లేకుండా పడుతనే ఉంది..
Reading Time: < 1 minute

హైదరాబాద్లో ఉన్నట్టుండి వర్షం.. ఈ ఏరియాల్లో గ్యాప్ లేకుండా పడుతనే ఉంది..

Caption of Image.

హైదరాబాద్ ను చాలా రోజుల తర్వాత వర్షం పలకరించింది. వానా కాలం వచ్చినా.. వేసవని తలపిస్తూ వస్తున్న వాతావరణం.. ఎట్టకేలకు చల్లబడింది. శుక్రవారం (జులై 17) సాయంత్రం 8 గంటల 20 నిమిషాల తర్వాత దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం ప్రారంభమైంది. 

శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, ఆర్సీ పురం, మాదాపూర్, షేక్ పేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్ తో వీకెండ్ లో ఐటీ ఉద్యోగులు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి.

ఇటు అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గోల్కొండ, టోలిచౌకి, అత్తాపూర్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, నాంపల్లి  ప్రాంతాల్లో కూడా వర్షం మొదలైంది. మరో గంట సేపట్లో సిటీ అంత వ్యాపిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

దాదాపు 25 రోజుల తర్వాత ఓ మోస్తరు వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ వాతావరణం చల్లబడింది. మధ్యమధ్యలో చిరు జల్లులు కురిసినట్లు అనిపించినా.. వర్షాకాలాన్ని తలపించే వానలైతే పడలేదు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

వర్షాలు లేక హైదరాబాద్ నగర వాసులకు ఇప్పటికీ ఎండా కాలం మాదిరిగానే నీటి కష్టాలు పడాల్సి వస్తో్ంది. సిటీ దాహార్తి తీర్చే ఉస్మాన్ సాగర్, గండి పేట చెరువుకు ఇప్పటి వరకు భారీ ఎత్తున నీరు వచ్చింది లేదు. ఈ దఫా వానలతోనైనా చెరువులకు వరద చేరుకుంటే బాగుండునని అధికారులు భావిస్తున్నారు. 

అటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భోనగిరి, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సిరిసిల్ల, నారాయన్ పేట్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పంటలు వేసేందుకు భూమి చదును చేసి పెట్టుకున్న రైతులకు ఈ వర్షాలైనా ఊరటనిస్తాయనే ఆశతో తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.