July 18, 2026

CIBIL Score: అతి తక్కువ వడ్డీకే లోన్‌ రావాలంటే మీకు సిబిల్ స్కోరు ఎంత ఉండాలి?

CIBIL Score: అతి తక్కువ వడ్డీకే లోన్‌ రావాలంటే మీకు సిబిల్ స్కోరు ఎంత ఉండాలి?
Reading Time: 2 minutes
CIBIL Score: అతి తక్కువ వడ్డీకే లోన్‌ రావాలంటే మీకు సిబిల్ స్కోరు ఎంత ఉండాలి?

CIBIL Score: రుణం తీసుకోవడం కంటే దాన్ని తిరిగి చెల్లించడం పెద్ద తలనొప్పి . అందువల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి తక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ రుణంపై వడ్డీ రేటు సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ పెరిగితేనే, తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందవచ్చు. మరి, మీరు తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో మీకు తెలుసా?

సిబిల్ స్కోరు ఎందుకు ముఖ్యం?

మీరు గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం కోసం దరఖాస్తు చేసినా, బ్యాంకులు మొదటగా మీ సిబిల్ స్కోర్‌ను చూస్తాయి. మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు సులభంగా రుణం ఇస్తాయి.

రుణ వడ్డీ రేటు సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది:

750 – 900 (అత్యుత్తమం): సిబిల్ స్కోర్ 750 – 900 మధ్య ఉంటే, బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు ఇస్తాయి.

700 – 749 (మంచిది): ఈ స్కోరుతో రుణాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వడ్డీ రేటు సగటుగా ఉండవచ్చు. కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు.

700 కంటే తక్కువ (అతి తక్కువ): సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే, రుణం పొందడం కష్టం. సిబిల్ స్కోర్ మరి తక్కువగా ఉంటే రుణం పొందడం కష్టం. ఒక వేళ మీకు బ్యాంకు రుణం ఇచ్చిన వడ్డీ మాత్రం భారీగా ఉంటుంది. మీరు తీసుకున్న అసలు కంటే రెట్టింపు మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

వినియోగదారులు తరచుగా అడిగే ప్రశ్నలు, సమాధానాలు:

ప్రశ్న: బ్యాంకు నుండి రుణం పొందడానికి సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం?

జవాబు: రుణం పొందడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్‌ను తప్పనిసరి చేసింది.

ప్రశ్న: తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందడానికి అవసరమైన సిబిల్ స్కోరు ఎంత?

జవాబు: తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందాలంటే, మీ సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉండాలి.

ప్రశ్న: సిబిల్ స్కోరు తగ్గితే ఏమవుతుంది?

జవాబు: మీ సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే బ్యాంకుల నుండి రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి