July 18, 2026

రూ.90 లక్షలు శాలరీ ఆఫర్.. జాబ్ రిజెక్ట్ చేసిన వ్యక్తి.. చెప్పిన కారణం వింటే షాకే!

రూ.90 లక్షలు శాలరీ ఆఫర్.. జాబ్ రిజెక్ట్ చేసిన వ్యక్తి.. చెప్పిన కారణం వింటే షాకే!
Reading Time: 2 minutes

రూ.90 లక్షలు శాలరీ ఆఫర్.. జాబ్ రిజెక్ట్ చేసిన వ్యక్తి.. చెప్పిన కారణం వింటే షాకే!

Caption of Image.

ఒక మంచి ఉద్యోగం వస్తే చాలామంది ముందుగా చూసేది జీతం. ఏడాదికి రూ.90 లక్షల ప్యాకేజీ అంటే ఎవరైనా రెండో ఆలోచన లేకుండా అంగీకరిస్తారని అనుకుంటారు. కానీ ఓ అభ్యర్థి మాత్రం అంత భారీ జీతాన్ని కూడా క్షణం ఆలస్యం చేయకుండా తిరస్కరించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను జీతం తక్కువగా ఉందని చెప్పలేదు, మరో కంపెనీ నుంచి ఎక్కువ ఆఫర్ వచ్చిందని కూడా చెప్పలేదు. కేవలం తాను రిపోర్ట్ చేయాల్సిన మేనేజర్ కారణంగానే ఆ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడట. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయాన్ని హెచ్‌ఆర్ కన్సల్టెంట్, వ్యాపార సలహాదారు మనోజ్ కుమార్ తన లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ లీడర్‌షిప్ పోస్టు కోసం సరైన అభ్యర్థిని వెతకడానికి వారాల తరబడి కృషి చేశారు. అనేక ఇంటర్వ్యూలు, డిస్కషన్స్ తర్వాత చివరకు సరైన వ్యక్తిని ఎంపిక చేశారు. కంపెనీ కూడా ఏడాదికి రూ.90 లక్షల శాలరీ ఆఫర్ ఇచ్చింది. దీంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని మనోజ్ కుమార్ భావించారు.

అయితే ఆ అభ్యర్థి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఆఫర్ చాలా బాగుంది. కానీ నేను రిపోర్ట్ చేయాల్సిన వ్యక్తితో పని చేయడం నాకు ఆనందంగా ఉండదనిపిస్తోంది. అందుకే ఈ ఉద్యోగాన్ని అంగీకరించలేను” అని స్పష్టంగా చెప్పాడు. జీతం పెంచాలని అడగలేదు, ఎలాంటి బేరసారాలు కూడా చేయలేదు. కేవలం భవిష్యత్తులో తనతో పనిచేసే మేనేజర్‌తో సరైన పని వాతావరణం ఉండదనే భావనతోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఈ ఒక్క నిర్ణయం మంచి జీతం కంటే మంచి నాయకత్వం ఉద్యోగులకు ఎంత ముఖ్యమో మరోసారి హైలైట్ చేసింది.

ఈ అనుభవం తర్వాత మనోజ్ కుమార్ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. “ప్రజలు కేవలం కంపెనీలను మాత్రమే ఎంచుకోరు.. తమను నడిపించే నాయకులను కూడా ఎంచుకుంటారు. మంచి జీతం ఉద్యోగంలో చేరేలా చేస్తుంది. కానీ మంచి మేనేజర్ మాత్రమే ఆ ఉద్యోగంలో ఎక్కువకాలం కొనసాగేలా చేస్తాడు” అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లడానికి చాలా సందర్భాల్లో జీతం కారణం కాదని, పని చేసే నాయకత్వమే అసలు కారణమని దీని ద్వారా తెలుసుకున్నట్లు అభిప్రాయపడ్డారు.

ALSO READ : మెటాకు షాకిచ్చిన మాజీ ఉద్యోగులు..

ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో కూడా భారీ స్పందన వచ్చింది. “డబ్బు బిల్లులు చెల్లిస్తుంది.. కానీ ప్రశాంతమైన వర్క్ ఎన్వీరాన్మెంట్ మన జీవితాన్ని కాపాడుతుంది”, “జీతం ఇంటర్వ్యూ టేబుల్ వరకు తీసుకెళ్తుంది.. కానీ నమ్మకం మాత్రమే ఉద్యోగాన్ని అంగీకరించేలా చేస్తుంది”, “గొప్ప నాయకులు సంస్థను గొప్పదిగా మారుస్తారు. ప్రతిభావంతులను ప్రోత్సహించే నాయకత్వమే సంస్థ విజయానికి అసలైన బలం” అంటూ పలువురు కామెంట్లు చేశారు. ఉద్యోగ ప్రపంచంలో భారీ జీతం ఒక్కటే కాదు.. గౌరవం ఇచ్చే మేనేజర్, ఆరోగ్యకరమైన పని సంస్కృతి కూడా అంతే ముఖ్యమని ఇది గుర్తు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.