July 18, 2026

వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఈ జట్లదే హవా.. అత్యధికసార్లు చేరిన టీమ్స్ ఇవే!

వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఈ జట్లదే హవా.. అత్యధికసార్లు చేరిన టీమ్స్ ఇవే!
Reading Time: 2 minutes

వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఈ జట్లదే హవా.. అత్యధికసార్లు చేరిన టీమ్స్ ఇవే!

Caption of Image.

FIFA World Cup Final: 1930లో ఉరుగ్వే వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) ప్రస్థానం నేటికీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడా పండుగగా కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న 2026 మెగా టోర్నమెంట్ ఈ ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ చరిత్రలో 23వ ఎడిషన్. రెండో ప్రపంచ యుద్ధం (World War II) జరిగిన కాలంలో మినహా, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ సమరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సుదీర్ఘ చరిత్రలో ప్రపంచకప్ ట్రోఫీ కోసం జరిగే తుది పోరు (ఫైనల్) కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్ల జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

టాప్లో జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా: 
ఫిఫా ఫైనల్స్ రేసులో ఐరోపా దిగ్గజం జర్మనీ ఏకంగా 8 సార్లు ఫైనల్ చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 4 సార్లు విశ్వవిజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు బ్రెజిల్, అర్జెంటీనాలు నిలిచాయి.  

* బ్రెజిల్: 7 సార్లు ఫైనల్ చేరిన బ్రెజిల్.. ప్రపంచంలోనే అత్యధికంగా 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్గా రికార్డు సృష్టించింది.

* అర్జెంటీనా: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సైతం ప్రస్తుతం జరుగుతున్న 2026 టోర్నీతో కలిపి మొత్తం 7 సార్లు ఫైనల్స్ ఆడింది. ఇందులో 3 సార్లు విజేతగా నిలిచింది.  

* ఇటలీ: మరో పటిష్టమైన జట్టు ఇటలీ 6 సార్లు ఫైనల్ చేరి, 4 సార్లు టైటిల్స్ సాధించి జర్మనీతో సమానంగా నిలిచింది.

ఇతర దేశాల ఫైనల్స్ రికార్డులు: 
మరో యూరోపియన్ పవర్‌హౌస్ ఫ్రాన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రపంచకప్ ఫైనల్స్ చేరగా, అందులో 2 సార్లు కప్ కొట్టింది. మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక రన్నరప్‌గా మిగిలిపోయింది. కాగా, ప్రస్తుతం ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనున్న స్పెయిన్, మొదటి ఎడిషన్ విజేత ఉరుగ్వే, హంగేరీ, చెకోస్లోవేకియా జట్లు తమ ఫుట్‌బాల్ చరిత్రలో రెండేసి సార్లు ఫైనల్స్ మెట్లు ఎక్కాయి.

  దేశం                                 ఫైనల్స్          గెలిచిన టైటిల్స్
* జర్మనీ                                 8                      4
* బ్రెజిల్                                7                      5
* అర్జెంటీనా                          7                      3
* ఇటలీ                                 6                      4
* ఫ్రాన్స్                                4                       2 
* నెదర్లాండ్స్                       3                       0
* స్పెయిన్                           2                        1
* ఉరుగ్వే                              2                       2
* హంగేరీ                              2                       0
* చెకోస్లోవేకియా                   2                       0

©️ VIL Media Pvt Ltd.