July 18, 2026

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!
Reading Time: < 1 minute
Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

కెరీర్ మొదలుపెట్టి పుష్కరం దాటిపోయింది. కావాల్సినంత డబ్బులు, రావాల్సినంత పేరు వచ్చేసాయి.. అయినా కూడా ఇప్పటికీ పిచ్చి పిచ్చి సినిమాలెందుకు చేయడం అంటున్నారు ఓ హీరోయిన్. వయసైపోతోందని ఏది పడితే అది చేయకుండా.. కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. క్వాంటిటీ కాదు క్వాలిటీయే ముఖ్యం అంటున్నారామె. మరి ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ..? పుష్కరం కింద నేనొక్కడినేతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కృతి సనన్.. ఆ తర్వాత హిందీలో టాప్ హీరోయిన్‌గా మారిపోయారు. అప్పట్లో ఖాళీగా ఉండకూడదని ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం కథ నచ్చితేనే డేట్స్ ఇస్తానంటూ గట్టిగా చెబుతున్నారు. బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుని కాన్ఫిడెంట్‌గా దూసుకుపోతున్నారీమే. వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేసే రోజులకి గుడ్‌బై చెప్పేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూట్ మార్చి క్వాలిటీకే ఓటేస్తోంది. తనకు నిజంగా కిక్ ఇచ్చే కథలనే ఎంచుకుంటూ.. రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా బిందాస్‌గా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తన కెరీర్, లైఫ్‌లో ఎక్సైటింగ్ ఫేజ్ నడుస్తోందని తెలిపారీమే. ఇక్కడి దాకా వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉందని ఫుల్ జోష్‌లో చెప్తున్నారు కృతి. పర్సనల్ లైఫ్‌లోనూ కృతిసనన్ తీసుకున్న ఓ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. వయసైపోతుందేమో, త్వరగా పెళ్లి చేసుకోవాలేమో అనే టెన్షన్ లేకుండా.. కెరీర్‌పై ఫోకస్ చేయడానికే ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నట్లు ఓపెన్‌గా చెప్పారు. ఏ ప్రెషర్ లేకుండా ఫుల్ ఫ్రీడమ్‌తో కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నారీమే. మొత్తానికి ఈ టైమ్‌లో తనకు క్వాంటిటీ కాదు కథల్లో క్వాలిటీ కావాలంటున్నారు కృతి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!

కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!

హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే

టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!