July 18, 2026

అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్.. ఈ సారి మామూలుగా లేదుగా! ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకర్లు మటాష్..

అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్.. ఈ సారి మామూలుగా లేదుగా!  ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకర్లు మటాష్..
Reading Time: 2 minutes

అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్.. ఈ సారి మామూలుగా లేదుగా! ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకర్లు మటాష్..

Caption of Image.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. తాజాగా  ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై  జరిపిన డ్రోన్లు, క్షిపణుల (మిసైల్స్) దాడిలో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు భారీగా ధ్వంసమయ్యాయని, వారికి తీరని నష్టం వాటిల్లిందని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ దాడిపై అమెరికా కానీ, జోర్డాన్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అసలేం జరిగిందంటే… ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సమాచారం ప్రకారం.. తూర్పు జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ అనే అమెరికా వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేసుకుని ఇరాన్  రాత్రిపూట విరుచుకుపడింది. ఈ దాడిలో అక్కడ ఉన్న అమెరికాకు చెందిన అత్యాధునిక F-16, F-35 యుద్ధ విమానాలు, గాల్లో ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలు, సైనిక డ్రోన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడి కారణంగా అమెరికా సైనికులు కొందరు ప్రాణాలు కోల్పోయారని, ఆ బేస్‌లో పనులన్నీ నిలిచిపోయాయని ఇరాన్ సైన్యం పేర్కొంది.

జోర్డాన్ స్పందన
గురువారం రాత్రి అల్-అజ్రాక్ బేస్ సమీపంలో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మా దేశ ఆకాశంలోకి వచ్చిన కొన్ని క్షిపణులను కూల్చేశామని జోర్డాన్ ఒప్పుకుంది కానీ, వైమానిక స్థావరం దెబ్బతిన్నదా లేదా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

ఇరాన్ ఎందుకు దాడి చేసిందంటే 
ఇటీవల దక్షిణ ఇరాన్‌లోని కొన్ని సైనిక స్థావరాలపై అమెరికా దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగానే  మేము ఈ దాడి చేశామని ఇరాన్ చెబుతోంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నీ మా  క్షిపణుల పరిధిలోనే ఉన్నాయని ఇరాన్ హెచ్చరించింది.

అంతులేని యుద్ధం 
నిజానికి ఇరాన్, అమెరికాల మధ్య ఫిబ్రవరిలో ఘర్షణలు  మొదలయ్యాయి. నెల రోజుల క్రితమే ఇరు దేశాలు ఒక ఒప్పందానికి   వచ్చినా, మళ్లీ దాడులు తీవ్రం చేశాయి. అమెరికా సైన్యం మా దేశంలోని ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బ్రిడ్జిలపై దాడులు చేసిందని.. ఈ  దాడుల్లో 8 మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. 

 అమెరికా గనుక మా దేశ ఆస్తులపై దాడులు చేస్తే, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా ఆస్తులన్నీ మాకు టార్గెట్లే అని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించారు. ఒమన్‌లోని రెండు అమెరికా రాడార్ కేంద్రాలపై, అలాగే సిరియాలోని అల్-తాన్ఫ్ అమెరికా సైనిక స్థావరంపై కూడా తాము దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది.
 

©️ VIL Media Pvt Ltd.