July 19, 2026

Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
Reading Time: < 1 minute
Devendra Fadnavis Resignation Sanjay Raut Maharashtra

Devendra Fadnavis: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్తారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. రాబోయే ఒకటి రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని శుక్రవారం సంజయ్ రౌత్ అన్నారు. సీఎం ఫడ్నవీస్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చని, ఒక సీనియన్ బీజేపీ మంత్రిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చని అన్నారు.

నాగ్‌పూర్ పర్యటనలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(యూబీటీ) చేపట్టిన ‘‘రామ రక్షా ఆందోళన్’’ కార్యక్రమ సన్నాహాలు పరిశీలించేందుకు ఆయన నాగ్‌పూర్ వెళ్లారు. జూలై 18న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించే కానుకల్లో జరిగిన అవకతవకలపై, నిధుల దుర్వినియోగంపై ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమానికి హిందూ సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్‌కు ఆహ్వానం పలికినట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాకుంటే ఆయన తరుఫున ఒక ప్రతినిధిని పంపమని కోరినట్లు తెలిపారు. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదని, రామ భక్తులు విశ్వాసం, పారదర్శకత కోసం చేస్తున్న డిమాండ్ అని ఆయన అన్నారు.