హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేయాలంటే?
కావాల్సిన పదార్థాలు : బిర్యానీ ఆకు, పెరుగు, షాజీరా, కొత్తిమీర, పూదీనా, ఆనియన్స్, బాస్మతి రైస్, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, లవంగాలు, నిమ్మకాయలు, ఫుడ్ కలర్, జాపత్రి, చికెన్,యాలకులు, దాల్చిన చెక్క, అనాసా పువ్వు, కారం పొడి, పసుపు, నెయ్యి.
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా అరకేజీ బియ్యం తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. చికెన్‌ను శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో పసుపు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీనిని ఒక పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో సరిపడ నూనె వేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మరికొంత నూనె వేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, అన్నీ వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి.
అవి బాగా వేగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని, పది నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. చికెన్ వేసి పదినిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, గరం మాసాలా, కారం, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ దాదాపు 80 శాతం ఉడికేలా చూసుకోవాలి.
మరో వైపు బిర్యానీ రైస్ తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేయాలి. అందులో బఠానీలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, పూదీన, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో రైస్ ఉడకడానికి సరిపడ నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు, అందులో రైస్ వేసుకోవాలి. రైస్ 80 శాతం ఉడికేలా చూసుకోవాలి. అది 80 శాతం ఉడికిన తర్వాత దానిని చికెన్ గ్రేవీలో వేయాలి.సగం చికెన్ గ్రేవీ, సగం, ఉడికించిన రైస్ ఇలా వేస్తూ, పై కొంచెం, కొత్తిమీర, పూదీన, ఉల్లి, అన్నీ వేసుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి రైస్ మొత్తం బాగా ఉడికేలా చూసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బిర్యానీ రైస్ రెడీ.




