Reading Time: 2 minutes

జస్ట్ మిస్.. అమ్మ జర్రుంటే సచ్చిపోతుండే.. దాహమేసిందని మంచం మీద నుంచి పక్కకెళ్లి వచ్చేలోపు..

Caption of Image.

నోయిడా: ఇంటి సీలింగ్ కూలి మీద పడినట్టు కొందరికి కలలు వస్తుంటాయి. కానీ.. ఈ ఘటన కల కాదు. నిజంగానే జరిగింది. నోయిడాలో సెక్టార్-75లో ఉన్న గార్డెనియా గేట్ వే సొసైటీలోని ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఉన్నట్టుండి ఇంటి సీలింగ్ కూలింది. బెడ్ మీద ఎవరూ లేని సందర్భంలో కూలడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో అప్రమత్తమై ఈ హౌసింగ్ కాంప్లెక్స్లోని ఫ్లాట్స్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సొసైటీలోని ప్లాట్ నెంబర్.9లోని టవర్ C-2లో ఉన్న ఫ్లాట్ నంబర్.1814లో ఈ ఘటన జరిగింది.

ఈ సంఘటన సొసైటీలోని ప్లాట్ నెం. 9లో ఉన్న టవర్ సి-2లోని ఫ్లాట్ నెం. 1814లో జరిగింది. ఇంట్లో ఈ ఘటన జరిగినప్పుడు ఒక్కరే ఉన్నారు. దాహమేసి నీళ్లు తాగడానికి అతను మంచం దిగి వెళ్లిన కొద్ది క్షణాలకే సీలింగ్ స్లాబ్‌లోని మెజార్టీ పోర్షన్ పెచ్చులై ఊడి ఉన్నట్టుండి కూలిపోయింది. ఊడిన పెచ్చులు మంచంపై, కింద ఫ్లోర్పై పడ్డాయి. ఒకవేళ పొరపాటను ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ సమయంలో బెడ్ పై ఉండి ఉంటే తీవ్ర గాయాల పాలై ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ ఘటన నివాసితులలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. ఫ్లాట్ కూలిపోయిందని విన్న వెంటనే వారంతా అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఈ ప్రమాదం ఒక్కటే కాదని, ఏళ్లుగా సొసైటీని పట్టిపీడిస్తున్న నిర్మాణ లోపాలకు ఇది మరో నిదర్శనమని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read ; వరల్డ్ ఫేమస్ ఆర్ఎస్ పురా బాస్మతి బియ్యం.. 

గార్డెనియా గేట్‌వేలో గోడలకు పగుళ్లు, ప్లాస్టర్ ఊడిపోవడం, బాల్కనీలు దెబ్బతినడం, పలు టవర్లలో నిరంతరంగా నీరు ఇంకడం వంటి నిర్మాణపరమైన సమస్యలు చాలా కాలంగా ఉన్నాయని ఈ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న వాళ్లు ఆరోపించారు. పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, బిల్డర్ అసలు నిర్మాణ లోపాలను సరిదిద్దకుండా కేవలం పైపైన మరమ్మతులు మాత్రమే చేశారని వారు ఆరోపించారు. గురువారం జరిగిన ఘటన అనంతరం, మొత్తం హౌసింగ్ కాంప్లెక్స్‌కు తక్షణమే నిర్మాణ భద్రతా తనిఖీ నిర్వహించాలని నివాసితులు నోయిడా అథారిటీని, ఇతర సంబంధిత అధికారులను కోరారు.

©️ VIL Media Pvt Ltd.