Bigg Boss Telugu10 : ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ హౌస్ సెట్ వర్క్ స్టార్ట్.. క్రేజీ కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్!

బుల్లితెరపై అత్యంత క్రేజ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సరికొత్త రికార్డుల వేటకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ల్యాండ్‌మార్క్ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్10 ‘ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రత్యేక సీజన్‌ను మరింత గ్రాండ్‌గా, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రూపొందించేందుకు నిర్వాహకులు భారీగా ప్లాన్ చేస్తున్నారు.
‘బిగ్ బాస్’ హౌస్ సెట్..
లేటెస్ట్ గా ‘బిగ్ బాస్’ హౌస్‌కు సంబంధించిన సెట్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ హౌస్ సెట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి..దాదాపు 100 రోజుల పాటు సాగే ఈ’బిగ్ బాస్ తెలుగు సీజన్10 ‘ జరిగే అవకాశం ఉంది. సీజన్-3 నుంచి షోను తనదైన స్టైల్‌లో నడిపిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున ఈ మైలురాయి సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ప్రసారం ఎక్కడంటే…
ఈ ప్రతిష్టాత్మక సీజన్ సరికొత్త రూపురేఖలతో, ఊహించని ట్విస్టులతో ఉండబోతోందని సమాచారం. ఈ షోను గతంలో కంటే మరింత గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నారు మేకర్స్. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 6వ తేదీన ఈ 10వ సీజన్ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. స్టార్ మా, జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
సామాన్యుల ‘అగ్నిపరీక్ష’తో సమరం..
గత సీజన్‌లో ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఏకంగా ట్రోఫీని గెలుచుకుని సంచలనం సృష్టించాడు. అదే ఫార్ములాను ఈసారి కూడా రిపీట్ చేయనున్నారు. సామాన్యులను ఫిల్టర్ చేసే ప్రక్రియ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన 8 మంది కామన్ కంటెస్టెంట్స్ నేరుగా ప్రధాన హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరికి తోడుగా 14 మంది సెలబ్రిటీలు నేరుగా ఎంట్రీ ఇస్తారు. అంటే ఈసారి మొత్తం 22 మంది కంటెస్టెంట్లతో హౌస్ కళకళలాడనుంది.
ALSO READ : రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్ డ్యాన్సర్స్ ..
క్రేజీ సెలబ్రిటీలు వీరేనా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారం.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీల లిస్టు చాలా ఆసక్తికరంగా ఉంది. కామెడీతో నవ్వించే ఎక్స్‌ప్రెస్ హరి, బుల్లితెర నటీమణులు సోనియా సింగ్, తేజస్విని, స్టార్ సింగర్ మంగ్లీ, పాపులర్ యాంకర్ నిఖిల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు నందు, రమణ వంటి వారితో పాటు మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆగస్టు మూడో వారంలోనే ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాపై పూర్తి స్పష్టత రానుంది. ఏదేమైనా, ఈ ల్యాండ్‌మార్క్ సీజన్-10 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.