బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీలో ఐదు రోజులు వర్షాలే వర్షాలు…

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వచ్చే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అల్పపీడనం ఉత్తర ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ గంగా పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
కోస్తాంధ్రలో ఇవాళ, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని.. వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.కోస్తాంధ్ర లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వేటకు వెళ్ళరాదని సూచించారు అధికారులు .
Also Read : 2024 ఎన్నికల్లో లాగా ఇప్పుడు తగ్గేది లేదు..!
దక్షిణ కోస్తాలో శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని… వేడి, తేమతో వాతావరణం అసౌకర్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
రాయలసీమలో శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఒకటి, రెండు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.