July 18, 2026

నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై అదృష్టం కలిసి వస్తుందట!

నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై అదృష్టం కలిసి వస్తుందట!
Reading Time: 2 minutes
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై అదృష్టం కలిసి వస్తుందట!

Negative Energy Remedies: భారతీయ సంప్రదాయంలో “నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది” అనే సామెత చాలా ప్రసిద్ధి. దీనర్థం, ఇతరుల అసూయ, ప్రతికూల ఆలోచనలు లేదా దృష్టి మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పెద్దలు విశ్వసించేవారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం నరదృష్టి కారణంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతారు. అందుకే నరదృష్టి నుంచి రక్షణ పొందేందుకు కొన్ని సంప్రదాయ పరిహారాలను శాస్త్రాలు సూచించాయి.

నరదృష్టి అంటే ఏమిటి?

నరదృష్టి లేదా దిష్టి అంటే, ఇతరుల అసూయ, ప్రశంస లేదా ప్రతికూల దృష్టి కారణంగా వ్యక్తి జీవితంలో అవాంఛిత మార్పులు చోటుచేసుకుంటాయని ఉండే నమ్మకం. ముఖ్యంగా కొత్త ఇల్లు, కొత్త వాహనం, చిన్నారులు, వ్యాపారం, సంపద లేదా విజయాలపై దిష్టి పడుతుందని చాలామంది విశ్వసిస్తారు. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం శుక్రవారం, అమావాస్య, ఆదివారం వంటి రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే నరదృష్టి ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

నరదృష్టి వల్ల కలుగుతాయని చెప్పే సమస్యలు

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం నరదృష్టి ప్రభావంతో…

  • తరచూ అనారోగ్య సమస్యలు రావడం
  • వైద్య పరీక్షల్లో స్పష్టమైన కారణం కనిపించకపోయినా ఆరోగ్యం బాగోలేకపోవడం
  • అకస్మాత్తుగా ఆర్థిక నష్టాలు ఎదురవడం
  • వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆటంకాలు రావడం
  • ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోవడం
  • కుటుంబ కలహాలు పెరగడం
  • చిరాకు, మానసిక అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయని చెబుతారు.

సముద్రపు నీటితో పరిహారం

సముద్రపు జలాలకు ప్రతికూల శక్తులను తొలగించే శక్తి ఉందని సంప్రదాయ నమ్మకం. వీలైతే సముద్రపు నీటిని ఒక సీసాలో తీసుకువచ్చి ఇంట్లో భద్రపరచాలి. ప్రతి శుక్రవారం ఆ నీటిని ఇంటి నాలుగు మూలల్లో, అలాగే డబ్బు ఉంచే ప్రదేశంలో కొద్దిగా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, కుటుంబ కలహాలు తగ్గి, వ్యాపారంలో పురోగతి కలుగుతుందని విశ్వసిస్తారు.

సముద్రపు ఉప్పుతో దిష్టి తొలగించే పరిహారం

ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని పెద్దలు చెబుతారు. శుక్రవారం రోజు సముద్రపు ఉప్పుతో పెద్దవారి చేత దిష్టి తీయించుకోవడం మంచిదని భావిస్తారు.
స్నానం చేసే నీటిలో చిటికెడు సముద్రపు ఉప్పు వేసుకుని తలస్నానం చేయడం కూడా శుభప్రదమని నమ్మకం. అందుకే పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో సముద్రస్నానం చేయాలని కూడా మన సంప్రదాయంలో సూచించారు.

సాంబ్రాణి ధూపం వేయండి

ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం… ఇంటి నాలుగు మూలల్లో,
పూజా గదిలో, వ్యాపార ప్రదేశంలో, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు.

ఎర్ర వస్త్రంలో ఉప్పు కట్టే పరిహారం

ఈ పరిహారం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా సముద్రపు ఉప్పు వేసి చిన్న మూట కట్టాలి. దానిని ఇంటి ప్రధాన ద్వారం లేదా వ్యాపార స్థలం ప్రవేశద్వారం వద్ద కట్టాలి. ప్రతి శుక్రవారం పాత ఉప్పును నీటిలో కలిపి పారబోసి, కొత్త ఉప్పు వేసి మళ్లీ కట్టాలి. ఇలా చేయడం వల్ల దిష్టి ప్రభావం తగ్గుతుందని చెబుతారు.

పచ్చ కర్పూరంతో హారతి

ప్రతి శుక్రవారం… పచ్చ కర్పూరంతో హారతి వెలిగించి ఆ కాంతి ఇంటి అన్ని గదుల్లో ప్రసరించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల వాతావరణం తొలగి ప్రశాంతత నెలకొంటుందని నమ్మకం.

కన్నుదిష్టి గణపతి పటం

శుక్రవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మానికి కన్నుదిష్టి గణపతి పటాన్ని ఏర్పాటు చేస్తే… ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని, కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని. నరదృష్టి ప్రభావం తగ్గుతుందని సంప్రదాయ విశ్వాసం. చివరగా, నరదృష్టిపై నమ్మకం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం. అయితే మన సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న ఈ పరిహారాలను చాలామంది ఆచరిస్తుంటారు. వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా భావించి పాటించవచ్చు. అదే సమయంలో ఆరోగ్య, ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైతే వైద్యులు, నిపుణులు లేదా సంబంధిత రంగాల సలహాలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం.

(Disclaimer: ఈ సమాచాంర సంప్రదాయ, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన పరిహారాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు.)