July 18, 2026

‘ టూత్ బ్రష్’ కోసం కోర్టుకు చేరిన గొడవలు.. నవ్వులు పూయిస్తున్న ‘పళ్ళ బురుసు’ ఫస్ట్ లుక్!

' టూత్ బ్రష్' కోసం కోర్టుకు చేరిన గొడవలు.. నవ్వులు పూయిస్తున్న 'పళ్ళ బురుసు' ఫస్ట్ లుక్!
Reading Time: 2 minutes

‘ టూత్ బ్రష్’ కోసం కోర్టుకు చేరిన గొడవలు.. నవ్వులు పూయిస్తున్న ‘పళ్ళ బురుసు’ ఫస్ట్ లుక్!

Caption of Image.

‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన రూరల్ బ్యాక్ డ్రాప్ కామెడీ చిత్రం ‘పళ్ల బురుసు’.  ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ క్రేజీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ టైటిల్ గ్లింప్స్ ను అండ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ‘ పళ్ల బురుసు’ అంటే ఏంటో తెలుసా? అనే..  ప్రశ్నతోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు.

టూత్ బ్రష్ చుట్టూ వివాదం…

టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ ఈ సినిమా కథ అంతా ఒక చిన్న ‘టూత్ బ్రష్'(పళ్ళ బురుసు) చుట్టూనే తిరగనుంది. వేపపుల్లతో పళ్ళు తోముకోలేక, పంటి నొప్పితో బాధపడే ఒక ముసలి రైతు (తండ్రి).. తన కొడుకును ఒక టూత్ బ్రష్ కొనివ్వమని అడుగుతాడు. అక్కడి నుంచి మొదలైన ఈ చిన్న రిక్వెస్ట్.. ఆ పల్లెటూరిలో ఎలాంటి గందరగోళానికి దారితీసింది? చివరికి ఒక టూత్ బ్రష్ కోసం తండ్రీకొడుకులు జిల్లా కోర్టు మెట్లు ఎక్కే వరకు వ్యవహారం ఎలా వెళ్ళింది? అనే పాయింట్‌ను అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ డ్రామాగా మలిచారు దర్శకుడు ఉదయ్ చౌహాన్.

పోస్టర్ అదిరింది.. 

ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే.. ఒక జిల్లా కోర్టు వెలుపల, త్రాసు లాగా ఉన్న ఒక భారీ టూత్ బ్రష్‌పై ప్రధాన నటులు ఇద్దరూ బ్యాక్-టు-బ్యాక్ కూర్చుని ఉన్న విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ యాద్మా, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ఇప్పుడే ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ ఏంటండీ బాబూ..

రిలీజ్ ఎప్పుడంటే?

ఆగస్టు 14, 2026న ఇండిపెండెన్స్ డే వీకెండ్ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో.. కథ కూడా అంతే కొత్తగా ఉండబోతుందనే సంకేతాలను ఇస్తున్నారు మేకర్స్. మరి  థియేటర్లలో నవ్వుల పూలు పూయించడానికి రెడీ అవుతోన్న ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

 

©️ VIL Media Pvt Ltd.