July 18, 2026

ఏపీలో విషాద ఘటన.. ఓవర్ టేక్ ఎంత ప్రమాదమో చూడండి.. పాపం ఈ అమ్మాయి !

ఏపీలో విషాద ఘటన.. ఓవర్ టేక్ ఎంత ప్రమాదమో చూడండి.. పాపం ఈ అమ్మాయి !
Reading Time: 2 minutes

ఏపీలో విషాద ఘటన.. ఓవర్ టేక్ ఎంత ప్రమాదమో చూడండి.. పాపం ఈ అమ్మాయి !

Caption of Image.

బస్సులు, లారీలను ఓవర్ టేక్ చేసే క్రమంలో అప్రమత్తంగా లేకపోతే.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే రెప్పపాటులో ప్రాణం పోతుంది. ఈ విషయాన్ని ఏపీ చిత్తూరు జిల్లాలోని పీలేరులో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. కన్ను మూసి తెరిచే లోపు 17 ఏళ్ల అమ్మాయి ప్రాణం పోయింది. పల్లె వెలుగు బస్సును స్కూటీతో ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఓవర్ టేక్ చేసే క్రమంలో స్కూటీ టైర్ స్కిడ్ అవడంతో బస్సు టైర్ కింద అమ్మాయి తల నలిగిపోయింది. తల మీద నుంచి బస్సు టైర్ వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై స్పాట్లోనే ప్రాణం పోయింది. పీలేరులోని పాత బస్టాండ్ దగ్గరలో ఈ ఘటన జరిగింది.

ఓవర్ టేక్ చేయడానికి జీవితాన్ని పణంగా పెట్టి వాహనాలు నడిపిస్తున్నారు. రెప్ప పాటులో అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రిలో రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక్క క్షణం ఆగి ఉంటే ఈ ఘటనలో అమ్మాయి బతికి ఉండేది. ఓపిక లేకపోవడం వల్ల జరిగిన అనర్థం ఇది. జీవితంలో ఓపిక, సహనం.. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఓపిక లేకపోతే ఎన్నో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

ముందు వాహనం నడిపేవాళ్లు వెళ్తే వెళ్లనివ్వడం మేలు. ప్రశాంతంగా నిదానంగా ప్రయాణాన్ని కొనసాగిస్తే ఏ ప్రమాదం లేకుండా ఇంటికి చేరుకోవచ్చు. మన కోసం ఇంటి దగ్గర ఎదురుచూసే మనుషులు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ చేసే సమయంలో దూకుడుగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే నిదానమే ప్రధానం అనే విషయం గుర్తుంచుకోవడం మంచిది. మన అతి వేగం కొన్ని సందర్భాల్లో మనతో పాటు ఇతరులకు కూడా ప్రాణ సంకటం కావచ్చు. నిర్దిష్ట వేగంతో సరైన దిశలో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపిస్తే క్షేమంగా గమ్యానికి చేరుకుంటారు.

©️ VIL Media Pvt Ltd.