హైదరాబాద్సిటీ, వెలుగు: హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ సోమవారం జీవో 679 జారీ చేసింది. 2026––27 బడ్జెట్‌లో ‘హైడ్రాకి సహాయం’ కింద ఈ నిధులు రిలీజ్చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే, క్యూర్ పరిధిలోని ప్రధాన చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.227.98 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. వీటితో ఫాక్స్ సాగర్, అమీన్‌పూర్, అంబర్, సరూర్‌నగర్ చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.