July 14, 2026

తెలంగాణలో ధరల దడ.. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం

తెలంగాణలో ధరల దడ.. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం
Reading Time: 2 minutes

తెలంగాణలో ధరల దడ.. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం

Caption of Image.
  • జూన్‌‌‌‌‌‌‌‌లో 6.30 శాతంగా రికార్డు
  • పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌పై వ్యాట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండడంతోనే
  • జాతీయ సగటు 4.38 శాతమే 

న్యూఢిల్లీ: తెలంగాణలో ధరలు కిందటి నెల  విపరీతంగా పెరిగాయి.  ద్రవ్యోల్బణం లెక్కల్లో మన రాష్ట్రం టాప్‌లో ఉంది. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం, తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 6.36 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు 4.38 శాతం కంటే ఎక్కువ. ఇంకా ఆర్‌‌బీఐ పెట్టుకున్న 4 శాతం లిమిట్‌ను ఎప్పుడో దాటేసింది.  ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతం చొప్పున రికార్డయింది . తమిళనాడులో 5.24 శాతంగా ఉంది. 

పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్  ధరలు అధికం

తెలంగాణలో ఇంధన ధరలపై వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్  (వ్యాట్) విపరీతంగా ఉండటం ధరల పెరుగుదలకు ముఖ్య కారణం.  పెట్రోల్ పై 35.2 శాతం, డీజిల్ పై 27 శాతం వ్యాట్ విధిస్తున్నారు. ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు అధికమయ్యాయి.  గ్రామాల్లో వేతనాలు పెరగడం, తాజా కూరగాయలు, ఇతర ఉత్పత్తుల కోసం పొరుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఆధారపడటం కూడా  ధరల భారాన్ని పెంచింది.

దేశ రిటైల్ ద్రవ్యోల్బణం పైపైకి

దేశ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ ఏడాది మేలోని 3.93 శాతం నుంచి జూన్​లో 4.38 శాతానికి చేరుకుంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.32 శాతానికి పెరిగింది. గ్రామాల్లో ఆహార ద్రవ్యోల్బణం 5.45 శాతం ఉండగా, పట్టణాల్లో 5.09 శాతం ఉంది. గ్రామాల రిటైల్ ద్రవ్యోల్బణం 4.74 శాతానికి పెరిగింది. పట్టణాల మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 3.92 శాతంగా ఉంది.  పట్టణాల కంటే పల్లెటూళ్లలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. 

50 శాతం రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువే

దేశంలోని సగం రాష్ట్రాల్లో ఆర్​బీఐ నిర్ణయించిన 4 శాతం లిమిట్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఆహారపానీయాల ద్రవ్యోల్బణం 5.05 శాతం, హోటళ్లు, వసతి సేవల ద్రవ్యోల్బణం అత్యధికంగా 6.91 శాతంగా నమోదైంది.  రవాణా రంగంలో 4.31 శాతం, విద్యా సేవల్లో 3.34 శాతం, గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్ ఇతర ఇంధన రంగాల్లో 1.99 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.

కొన్నింటి ధరల్లో తగ్గుదల

కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి. బంగాళాదుంపల ధరలు కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో  20.34 శాతం తగ్గాయి. పచ్చి బఠానీల ధరలు 9.67 శాతం, కార్లు, జీపుల ధరలు 6.89 శాతం, జీలకర్ర ధరలు  3.75 శాతం తగ్గాయి. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు  3.49 శాతం మేర తగ్గాయి. సాధారణంగా గతంలో రూ.100 ఉన్న కొన్ని వస్తువుల ధరలు ఇప్పుడు రూ.105 వరకు పెరిగాయి.  ఈ పెరుగుదల వల్ల సాధారణ ప్రజల బడ్జెట్ పై భారం పడుతోంది. 

©️ VIL Media Pvt Ltd.