July 14, 2026

Korean Kanakaraju Teaser: ఈసారి హిట్ పక్కా.. ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు

Korean Kanakaraju Teaser: ఈసారి హిట్ పక్కా.. ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు
Reading Time: 2 minutes
Korean Kanakaraju Teaser: ఈసారి హిట్ పక్కా.. ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ ‘కంసంనిద’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన రాయలసీమలోని పెనుకొండ ఊరిని పరిచయం చేస్తాడు. అల్లరి, సరదాగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ రహస్యమైన పాత్రతో పాటు అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి. ఆ కొరియన్ ఆత్మ కనకరాజును ఆవహించడంతో అతను ‘కొరియన్ కనకరాజు’ గా మారిపోతాడు. అక్కడి నుంచి కామెడీ, యాక్షన్, హారర్, ఫాంటసీ అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.

వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. ముఖ్యంగా రాయలసీమ యాసను ఆయన పలికిన తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. లాంగ్ హెయిర్ లుక్‌లో మాస్ అప్పీల్‌తో ఆకట్టుకున్న ఆయన, చివర్లో కొరియన్ కనకరాజుగా కనిపించే గెటప్ విజిల్స్ వేయించేలా ఉంది. ముఖ్యంగా సత్యతో కలిసి వచ్చే కామెడీ సన్నివేశాలు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. కొరియన్ అమ్మాయి పాత్రలో రితికా నాయక్ కూడా చాలా అందంగా కనిపించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ తన కామెడీ టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని చక్కగా బ్లెండ్ చేస్తూ వినోదాత్మకంగా కథను తెరకెక్కించిన తీరు ఆసక్తిని పెంచుతుంది. రూరల్ కామెడీ, హారర్, ఫాంటసీ, యాక్షన్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ టీజర్‌ అదిరిపోయింది.

మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ రాయలసీమ అందాలను, కొరియాలోని కలర్ ఫుల్ లొకేషన్లను ఎంతో అందంగా చూపించింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరో ప్రధాన బలం. హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ ఎమోషన్స్‌ను సంగీతంతో బాగా ఎలివేట్ చేశారు. సత్య జి ఎడిటింగ్ కూడా ఆసక్తికరంగా సాగింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో ఉన్నతంగా కనిపిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ అంశాలను వినోదాత్మకంగా పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కొత్త కాన్సెప్ట్, ఆకట్టుకునే విజువల్స్, కమర్షియల్ ట్రీట్‌తో ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.