July 14, 2026

హైడ్రాకు 12.50 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైడ్రాకు 12.50 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Reading Time: < 1 minute

హైడ్రాకు 12.50 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Caption of Image.

హైదరాబాద్: హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రోపాలిటన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ నుంచి జీవో విడుదలైంది. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. ఆర్థిక శాఖ విడుదల ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

నిధులు డ్రా చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుల వివరాలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఓ నెం.679తో 12.50 కోట్లకు పరిపాలనా శాఖ నుంచి హైడ్రాకు అనుమతి లభించింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ జీవో జారీ చేశారు.

►ALSO READ | సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు 14 రోజుకు రిమాండ్

హైడ్రాను కేవలం ఒక ఏజెన్సీగా కాకుండా, తిరుగులేని ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, చట్టపరమైన విచారణ జరిపే అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన విభాగాన్ని కేటాయించబోతున్నారు. చెరువులు, నాలాలు, పార్కులు ఎక్కడ ఆక్రమణకు గురైనా ఇతర శాఖల ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, చట్టబద్ధంగా హైడ్రానే నేరుగా చర్యలు తీసుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.