July 7, 2026

కొంపముంచిన ఓవర్ సెలబ్రేషన్స్.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఔట్

కొంపముంచిన ఓవర్ సెలబ్రేషన్స్.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఔట్
Reading Time: < 1 minute

కొంపముంచిన ఓవర్ సెలబ్రేషన్స్.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఔట్

Caption of Image.

బ్రిటన్: ఆటలో గెలిచిన తర్వాత ప్లేయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కామన్. కొందరు విజయాన్ని నార్మల్‎గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు అగ్రెసివ్‎గా విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ ఓవర్ సెలబ్రేషన్సే ఇంగ్లాండ్ ఫుట్ బాల్ జట్టు కొంపముంచాయి. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్, మెక్సికో జట్లు తలపడ్డాయి. 

హోరాహోరీగా సాగిన ఈ పోరులో 3-2తో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్‎కు దూసుకెళ్లడంతో ఆ జట్టు ఆటగాళ్లు పెద్ద ఎత్తున విన్నింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ సీనియర్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ గాయపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ అభిమానులతో సంబరాలు చేసుకుంటున్న సమయంలో హెండర్సన్ అడ్వర్టైజింగ్ హోర్డింగ్ (ప్రకటనల బోర్డు) పైనుంచి దూకడానికి ప్రయత్నించి జారిపడటంతో అతని మణికట్టుకు తీవ్రంగా గాయమైంది. 

అతడిని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సర్జరీ తప్పదని చెప్పారు. దీంతో ఫిఫా వరల్డ్ కప్ నుంచి హెండర్సన్ అర్ధాంతరంగా నిష్క్రమించాడు. టోర్నీ కీలక సమయంలో హెండర్సన్ దూరం కావడం ఇంగ్లాండ్ కు భారీ ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అతి విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంగ్లాండ్ కొంపముంచాయి.  

 

©️ VIL Media Pvt Ltd.