
- ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్, వెలుగు: పటాన్‌చెరు పరిధిలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.2.80 కోట్ల పరిహారం చెల్లించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని సర్వే నెంబర్ 190లో గల 7,882 చదరపు గజాలు భూ సేకరణకు సంబంధించి పరిహారాన్ని పెంచుతూ గతంలో కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా హెచ్‌ఎండీఏ నిధుల నుంచి పెంచిన పరిహారం మొత్తాన్ని వెంటనే భూ నిర్వాసితులకు అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.